విశ్లేషణ….

0
483

ఈ మధ్య కాలంలో ప్రతీ విషయమూ విశ్లేషణే.
అవసరార్ధమా..లేక తెలుసుకునే విషయజ్ఞానం ఉండటం వలనా అంటే ఏదీ కాదు..
కేవలం ఏది మాట్లాడాలి..ఏది మాట్లాడకూడదు అన్న అవగాహనా రాహిత్యం వలన..
ఒక అనవసర విషయాన్ని గూర్చి ఎన్ని సార్లు  ఎంత మాట్లాడినా అది అనవసరమే అవుతుంది..
అవసరమైన విషయానికిచ్చే ప్రాముఖ్యత అనవసరాలకు కూడా దక్కుతుంది..
రెండింటి గురించి సమంగానే మాట్లాడుకుంటాం..

ఓ విషయం తప్పు అని మనసుకి అనిపించింది..అదే విషయాన్ని చెప్పినప్పుడు ..
నీకు తప్పు ఎలా?? అంటే వివరణ ద్వారా తెలియచేయటం పద్ధతి..
వివరణ మానేసి విశ్లేషణ మొదలు పెడుతున్నాం..
అసలు ప్రతి విషయానికీ విశ్లేషణ ఏమిటీ..
ఓ ఘటనకి..సంఘటనకి..ఓ వార్తకి.. ఓ మాటకి..ఓ పనికి..ఓ సినిమాకి..అవసరమా అసలు..
ఎవరి మనోభావాలకు తగ్గట్టు వారి వారి అభిప్రాయాలు ఉండటం సహజం..అభిప్రాయం వెల్లడి చేయటం మాములే..అభిప్రాయాలను పక్కనపెట్టి విశ్లేషణలు మొదలయ్యాక ప్రశ్నించటం…ఆశించిన సమాధానం..లేదా ఆశించిన అభిప్రాయాలు బలవంతం గా నైనా ఒప్పించాలనుకోవటం అలవాటైపోయింది..

ప్రతి ఒక్కరూ.. ప్రతి ఒక్క దానిమీదా విశ్లేషణలే..
అసలు కంటే కొసరు ముద్దు అని …అసలు దానికంటే విశ్లేషణలు ఇచ్చిన దానికే విలువెక్కువైంది..

పిల్లలు వాడే పాలడబ్బాలు..పౌడర్లు మొదలు..నేపీల దాకా
చీపురు దగ్గర నుండి పచారి సామాను దాకా
స్విచ్ దగ్గర నుండి భారి సామగ్రి వరకు
పిల్లల బొమ్మల సైకిల్ నుండి కార్ల వరకు ప్రతీది….ఎందుకు కొనాలో వాళ్ళు చెబుతూ…
ఎందుకు వాడుతున్నారో మనల్ని అడుగుతున్నారు..
అభిప్రాయ సేకరణ నుండి విశ్లేషణా స్థాయికి చేర్చారు..

ఓ సినిమా చూడాలంటే మనసుకు నచ్చితే చూసేవాళ్ళం..లేదా మనేసే వాళ్ళం.
నచ్చితే నచ్చిందని …లేదంటే లేదని చెప్పేవాళ్ళం…
అంతటితో ఆ విషయం ఐపోయింది..
ఇప్పుడు…నచ్చలేదా….ఎందుకు…అలా ఎలా నచ్చలేదు…అంటూ ప్రశ్నలు
నచ్చిందా….ఎలా నచ్చింది…ఇలాంటివి కూడా నచ్చుతాయా అంటూ గొడవ..

ఏదీ..ఎక్కడా…తమవరకే పరిమితం కావడంలేదు..కావాలని ఆశించటమూ లేదు.
తాము చెప్పిందే నిజం..యదార్ధం…అంటూ నిరూపణలు మొదలయ్యాయి..
ఎలా ఉండాలో తెలిసినవారు ఎప్పుడూ ఒకలానే ఉంటారు..

మధ్య లో వచ్చిన మిథ్యా జ్ఞానం వలన ఎగిరెగిరి పడుతూ…నాకన్నానా అనుకునే వారెప్పటికీ అంతే…
మీలానే కాస్త బుర్ర..కాస్త మనసు అందరికీ ఉంటాయన్న విషయం గుర్తెరిగి మీ అభిప్రాయాలతో మాత్రమే అలరించ ప్రార్ధన.._/\_


@ తులసి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.