ఋతునొప్పి కోసం గృహనివారణలు

0
564

ఋతుస్రావం స్త్రీ జీవితం లో సహజ భాగం, కానీ బాధాకరమైన ఋతు నొప్పి అనేక మందికి చాలా బాధించే సమస్యగా ఉంటుంది. ఋతు నొప్పి అరుదుగా ఆందోళనకు కారణ మైనప్పటికీ, తీవ్రమైనదిగా ఉంటే వారి సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. బహిష్టు సమయంలో ప్రోస్టాగ్లాండిన్ (prostaglandin) అనే హార్మోన్ వంటి పదార్ధం, గర్భాశయ కండరాలను సంకోచింపజేసి ఋతు నొప్పిని కలిగిస్తుంది.

ఋతు నొప్పి పొత్తి కడుపు లో తక్కువ స్థాయి లేదా తీవ్రమైన నొప్పికి కారణ మవుతుంది, ఆపై నడుము క్రింద భాగం మరియు తొడల వరకు నొప్పి వ్యాపించవచ్చు. సాధారణంగా ఋతు నొప్పి మొదటి రెండు మూడు రోజుల తర్వాత తగ్గవచ్చు. కొందరి మహిళలలో కేవలం వారి ఋతు చక్రం ముందు నొప్పి కలుగవచ్చును.

ఋతు నొప్పికి కొన్ని కారణాలుగా చిన్నవయసులోనే ఋతుస్రావం ప్రారంభమవటం, జన్యు పరంగా, ఋతు సమయంలో భారీ రక్తస్రావం, అనారోగ్య అలవాట్లుగా ధూమపానం, అధిక మద్యపానం, మాదక ద్రవ్యాల సేవన, మరియు ఎక్కువగా కదలికలు లేకుండాకూర్చునే ఒక నిశ్చల జీవనశైలి పరిగణలోకి వస్తాయి. కొందరి మహిళలలో, ఋతు నొప్పి ప్రసవానంతరం తగ్గవచ్చు లేదా పూర్తిగా నివారింపబడవచ్చును.


1. వేడి కాపడం
ఋతు నొప్పిని నియంత్రించడానికి పొత్తి కడుపు మీద వేడి వర్తింప చేయటం ఒక సులభమయిన మార్గం. వేడి గర్భాశయం లో సంకోంచించ బడిన కండరాలకు విశ్రాంతిని ఇచ్చుటలో సహాయపడుతుంది.
• పొత్తి కడుపు మీద, నడుము క్రింది భాగంలో ఒక వేడి ప్యాడ్ ఉంచండి. వేడి నీటితో నింపిన సాధారణ ప్లాస్టిక్ సీసాను కూడా ఉపయోగించవచ్చు. మీరు మరింత సుఖమైన అనుభూతి పొందే వరకు వేడిని వర్తించండి.
• ప్రత్యామ్నాయంగా, వేడి నీటిలో ఒక టవల్ ముంచి, అదనపు నీటిని బయటకు పిండి, లేదా తడి టవలును మెలిపెట్టి అదనపు నీటిని బయటకు పిండి మైక్రో ఓవన్లో ఒక నిమిషం పాటు వేడి చేయవచ్చును. ఆపై వేడి టవలును పొత్తి కడుపు మీద, నడుము క్రింది బాగంలోను టవల్ చల్లబడే వరకు ఉంచండి . కొన్ని నిమిషాల పాటు నొప్పి తగ్గేంత వరకు పునరావృతం చెయ్యండి.
• వేడి షవర్ కూడా నొప్పి నుంచి ఉపశమనం కలిగించవచ్చు.


2. అల్లం
అల్లం సమర్థవంతంగా ఋతు నోప్పిని నివారించే ఒక అద్భుతమైన మూలిక. ఈ మూలిక నొప్పి కలిగించే ప్రోస్టాగ్లాండిన్స్ (prostaglandins) స్థాయిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కూడా బహిష్టుకు పూర్వ లక్షణంతో ముడిపడిన అలసటతో పోరాడటానికి మరియు అపక్రమ ఋతు చక్రాలను సాధారణంగా చేయడానికి సహాయపడుతుంది.
• 2 అంగుళాలు పొడవుగల అల్లం తీసుకొని, చిన్న చక్రాలుగా తురమండి. ఐదు నిమిషాల పాటు ఒక కప్పు నీటిలో మరిగించండి. ఆపై వడకట్టి, కొద్దిగా తేనె మరియు నిమ్మ రసం జోడించండి. మీ ఋతుసమయంలో ఈ టీని రోజువారి మూడు సార్లు
• మీ వంటలలో, ఆహారంలో అల్లం జోడించడానికి ప్రయత్నించండి లేదా కొన్ని అల్లం కాండీలను చప్పరించటం చేయవచ్చు.


3. తులసి
తులసి ఋతు నొప్పి తగ్గించే మరొక చాలా ప్రభావవంతమైన హెర్బ్. తులసి లోని కేఫిక్ ఆమ్లము (Caffeic Acid) నకు అనాల్జేసిక్, లేదా నొప్పి నివారించే లక్షణాలున్నాయి.
• ఒక కప్పు మరుగుతున్న నీటికి ఒక టేబుల్ స్పూను తులసి ఆకులు జోడించి, మూత పెట్టండి, 3-5 ని మరిగిన పిమ్మట చల్లబరచండి. ఈ పానీయం ప్రతి కొన్ని గంటలకు నొప్పి సులభం తగ్గటానికి సేవించండి.
• ప్రత్యామ్నాయంగా, గుప్పెడు తులసి ఆకులు రసం తీసి, ఒక కప్పు వెచ్చని నీటిలో రెండు టీ స్పూను జోడించి, మరిగించి చల్లార్చండి. నొప్పిగా ఉన్నప్పుడు ఈ పానీయం రోజువారీ మూడు సార్లు సేవించండి.
• మీ ఆహారం లో తాజా తులసి ఆకులు జోడించవచ్చు.


4. దాల్చిన
దాల్చిన వ్యతిరేక అనియంత్రిత వ్యాకోచం (antispasmodic), వ్యతిరేక గడ్డకట్టు (anticlotting) మరియు శోథ నిరోధక (anti-inflammatory) లక్షణాలు కలిగి ఋతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. అదనంగా, దాల్చిన ఆహార ఫైబర్, కాల్షియం, ఇనుము మరియు మాంగనీస్ లకు ఒక అద్భుతమైన మూలం.
• ఒక కప్పు వేడి నీటికి నాలుగో వంతు టీస్పూను దాల్చిన చెక్క పొడి కలిపి, మూత పెట్టి, ఐదు నిమిషాలపాటు మరిగించండి. చల్లార్చి కొద్దిగా తేనె జోడించండి. ఆపై ఋతు నొప్పి నివారించడానికి ఋతువు మొదలయ్యే రెండు రోజుల ముందు నెమ్మదిగా గుటకలతో ఈ దాల్చిన టీ, రెండు మూడు కప్పులు, రెండు రోజులు త్రాగండి.
• ఒక గ్లాసు గోరు వెచ్చని నీటికి అర టీస్పూను దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె జోడించండి. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు, ఋతు కాలం మొదటి రోజు మూడు సార్లు ఈ పానీయం సేవించండి.


5. సోపు (Fennel)
సోపు వ్యతిరేక అనియంత్రిత వ్యాకోచం (antispasmodic), ఫైటోఈస్ట్రోజెన్ (phytoestrogen) మరియు శోథ నిరోధక (anti-inflammatory) లక్షణాలు కలిగి గర్భాశయం లోని కండరాలకు విశ్రాంతిని ఇచ్చి, క్రమంగా ఋతు నొప్పి, తిమ్మిరి మరియు అసౌకర్యం నుంచి ఉపశమనం ఇస్తుంది.

ఒక కప్పు వేడి నీటికి ఒక టీ స్పూను సోపు గింజలు జోడించండి. ఐదు నిమిషాలపాటు తక్కువ మంటలో (Simmer) మూత పెట్టి మరిగించండి. మంట నుండి తొలగించి, చల్లార్చి మరియు వడకట్టండి.
ఒక టీ స్పూను తేనె వేసి బాగా కలపండి.

ఈ మూలికా టీని రోజువారీ రెండు సార్లు ఋతుచక్రం ప్రారంభమయ్యే మూడు రోజుల ముందు నుంచి సేవించండి. సేవన తరువాత ఋతువులో నొప్పి కొనసాగితే ఈ మూలికా టీని త్రాగటం కొనసాగించండి. ఉత్తమ ఫలితాల కోసం ఈ పానీయం వేడిగా గుటకలతో త్రాగాలని గుర్తుంచుకొనండి.


6. చెరుకు మడ్డి (Blackstrap Molasses)
ఋతు నొప్పి నివారణకు పరీక్షించిన పరిహారాలలో చెరుకు మడ్డి కూడా ఉంది. కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ B6 మరియు సెలీనియం పుష్కలంగా ఉండటం వలన, చెరుకు మడ్డి రక్తం గడ్డకట్టడం తగ్గించడానికి మరియు గర్భాశయ గోడల కండరాల ఉపశమనానికి సహాయపడుతుంది. ఇందు వలన బహిష్టు సమయంలో నొప్పి తగ్గుతుంది.]

ఒక కప్పు వెచ్చని పాలలో ఒకటి – రెండు టీస్పూన్ల చెరుకు మడ్డి (Blackstrap Molasses) జోడించండి. నొప్పి మొదలయిన వెంటనే తగ్గేవరకు త్రాగండి. మరియు అవసరమైనంత వరకు (నొప్పి తగ్గేవరకు) త్రాగడం కొనసాగించండి.


7. అవిసె గింజలు (flaxseeds) 
అవిసె గింజలు (flaxseeds) ఋతు నొప్పి తీవ్రత తగ్గించడంలో శ్రేష్ఠమయినది. అవిసె గింజల లోని అవసరమైన కొవ్వు ఆమ్లాలు, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని స్థిరీకరించేందుకు సహాయం చేస్తాయి. అవిసె గింజలు గర్భాశయ పనితీరును మెరుగుపరిచేందుకు మరియు సంతానోత్పత్తి సమస్యల పరిష్కరానికి సహాయపడతాయి.

ఋతు నొప్పి ఉపశమనానికి రోజువారీ ఒకటి రెండు టేబుల్ స్పూనుల అవిసె గింజలను తినాలి. సలాడ్లలో లేదా కాయధాన్యాలతో (గోధుమ, బార్లీ, ఓట్లు, మొక్కజొన్న మొదలైనవి) లేదా పెరుగుతో లేదా స్మూతీ లో అవిసె గింజల పొడిని చల్లి తినవచ్చు.


8. బొప్పాయి
బొప్పాయి ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్, ఋతు నొప్పి చికిత్సలో చాలా సహాయకారిగా ఉంటుంది. దీని లోని కెరోటిన్, ఇనుము, కాల్షియం, విటమిన్లు A మరియు C, గర్భాశయ గోడల ఉపశమనంలో మరియు కండర సంకోచాలను సులభతరం చేయడంలో సహాయం అందిస్తాయి.
ఋతు చక్రానికి ముందు, ఋతు కాలంలోను, నొప్పి తగ్గించడానికి లేదా తొలగించడానికి మీ ఆహారంలో బొప్పాయిని జోడించండి.


9. వ్యాయామము
ఈ నివారణలతోబాటు, ఋతు నోప్పిని తొలగించుకోవటంలో సహాయంగా యోగా మరియు హృదయ వ్యాయామాలు చేయవచ్చు. అలాగే, నీరు పుష్కలంగా త్రాగడం మర్చిపోరాదు. పీరియడ్స్ సమయంలో సున్నితమైన వ్యాయామం కొనసాగించటం ముఖ్యం. అంతర్గత నల్లమందు (Opioids) (బీటా-ఎండోర్ఫిన్స్) విడుదలకు సహాయపడుతుంది. అంతర్గత నల్లమందు (Opioids) శరీరంలో ఉత్పత్తి చేయబడే మీ సొంత ‘మానవ మార్ఫిన్’.

మీ ఋతు కాలము ముందు ఉబ్బరం కలగటం సహజమైనది. మీ ఋతు కాలమునకు కొన్ని రోజుల ముందు ఉప్పు తీసుకోవడం తగ్గించినట్లయితే మీ మూత్రపిండాలు అదనపు నీటిని శరీరం నుండి తొలగించటంలో సహాయం చేస్తుంది. మీరు ఋతు కాలంలో ఈ 4 యోగ భంగిమలు నొప్పిని నివారించటానికి ప్రయత్నించవచ్చు.
http://www.thehealthsite.com/…/4-yoga-poses-to-beat-menstr…/


10. అదనంగా మరిన్ని చిట్కాలు
• కొంత ముందు జాగ్రత్తగా ముఖ్యంగా నడుము వద్ద బిగుతుగా ఉన్న బట్టలు ధరించకండి.
• మీ అల్పాహారం లోపాలు ఒక గ్లాసు చేర్చండి. కాల్షియం ఋతు నొప్పికి ఒక మంచి నివారణ.
• క్యారెట్లు మీ కళ్ళు కోసం మాత్రమే కాకుండా; అవి కూడా ఋతుస్రావం నియంత్రించటంలో సహకరిస్తాయి.ఒక పొడవైన గ్లాసు క్యారట్ రసం మీకు చాలా మంచి అనుభూతి నిస్తుంది.
• తేనె తో అలోయి వెరా రసం కూడా ఋతు స్రావాన్ని నియంత్రించగలదు మరియు నొప్పి తగ్గించే సులభం మార్గం అంటారు.
• రెడ్ మాంసం (మేక, గొర్రె…) మరియు కెఫిన్ను నివారించండి. అవి నొప్పిని మరింత ఉధృతం చేస్తాయి.
• కేవలం 10 నుండి 15 నిమిషాలలో ఉపశమనం కలగటానికి మీ ఉదరం చుట్టూ లావెండర్ నూనె రాయండి.
• విశ్రాంతి, ఒక పుస్తకం చదవండి, మృదవైన సంగీతం వినండి లేదా స్నేహితులతో మాట్లాడండి. మీరు సంతోషంగా ఉంటే, మీ మనస్సు మీరు భౌతిక నొప్పితో పోరాడటానికి సహాయం చేస్తుంది.

ముఖ్య గమనిక: మీరు ముందు అనుభవించిన నొప్పి లాగ లేకుంటే, కటి వలయములో, ఫైబ్రాయిడ్లు, పాలీసెస్టిక్ గర్భాశయ సిండ్రోమ్ (PCOS / PCOD), కటి సోకు, బహిష్టుకు పూర్వ లక్షణంతో కూడిన ఏ కారణం కాదని నిర్ధారించుటకు నిశితంగా పర్యవేక్షించడానికి డాక్టరు సలహా అత్యవసరం.


Subbarao Kasturi 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.