అందానికి అతి చవక చిట్కాలు

0
656

వనితలు తమ చర్మం, గోర్లు, పళ్ళు మరియు జుట్టు సంబంధించిన అందాల సమస్యలు పరిష్కరించడానికి సౌందర్య ఉత్పత్తులు మార్కెట్ విరివిగా లభిస్తాయి. అయితే, ఈ ఉత్పత్తులు ఖరీదైనవి మరియు మీరు కోరిన ఫలితం పొందలేక పోవచ్చును.

దోష రహిత చక్కదనం పొందుటకు, ఇంత ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మంచి ఫలితాలకు కొన్ని అద్భుత సహజ నివారణలు ఎల్లప్పుడూ ఉన్నాయి. సహజ చికిత్సలతో పాటు, మీరు లోపల అలాగే బయట అందమైన చక్కదనం పొందుటకు సరైన పోషకాహారం, వ్యాయామం, మంచి నిద్ర, మరియు మీ ఒత్తిడి స్థాయి అదుపులో ఉంచడం ముఖ్యం.

1. మోటిమలు, మచ్చలు 
సర్వసాధారణంగా మోటిమలు, మచ్చలు మరియు ఇతర చర్మ సమస్యలు టీనేజర్లకు సంభవించవచ్చు. నిజానికి, టీనేజర్లకు 70 – 87 శాతం ఈ సమస్యలు ఉంటాయి. మొటిమలు వీపు మీద, నెత్తి మీద, చర్మం పైన, ముఖం మీద, ఛాతీ మీద కనిపిస్తాయి. అధిక చమురు ఉత్పత్తి, విహితమైన చర్మ కణాలు, చర్మ రంధ్రాలకు అడ్డుపడడం వలన బాక్టీరియా చేరి మోటిమలు కలగుటకు సాధారణ కారకాలవుతాయి.
• రాత్రి నిదురించే ముందు ప్రభావిత ప్రాంతం మీద తెలుపు టూత్ పేస్టు చిన్న మొత్తంలో రుద్దండి, మరుసటి రోజు అది శుభ్రం చేయండి. కొన్ని రోజుల పాటు రోజువారీ మీ చర్మం మీద పూర్తిగా తగ్గే వరకు పునరావృతం చెయ్యండి.
• తక్కువ నుంచి ఉధృతం గా ఉన్న మొటిమల నివారణకు కలబంద గుజ్జు కూడా ప్రభావవంతంగా ఉంటుంది. కలబంద ఆకు నుండి సేకరించిన జెల్ రోజువారీ 2 నుండి 3 సార్లు ప్రభావిత ప్రాంతం మీద రాయండి. యంటీబాక్టీరియా మరియు శోథ నిరోధక (anti-inflammatory) లక్షణాలు గల కలబంద మొటిమల కలిగించే బాక్టీరియా ను నిర్జీవం చేసి అలాగే వాపు తగ్గించే సహాయం అందిస్తుంది.

2. పగిలిన పెదవులకు చక్కెర స్క్రబ్
• అదే అందం విషయానికి వస్తే, మీరు మీ పెదవులు విస్మరించకూడదు. మృదువైన, గులాబీ పెదవులు మీ ముఖం యొక్క కనిపించే తీరును మెరుగుపర్చ గా, పగుళ్లు మరియు నల్లని పెదవులు మీ మొత్తం అందం పాడు చేయవచ్చు.
• తక్కువ నాణ్యత పెదవి సంరక్షణ ఉత్పత్తులు వాడకం, అధిక ప్రత్యక్ష సూర్యకాంతి, అధిక ధూమపానం, అధిక కెఫీన్ తీసుకోవడం మరియు హార్మోన్ల అసమతౌల్యం నల్లని పెదవులు ఏర్పడటానికి దారితీస్తుంది కనుక వీటి నుంచి దూరంగా ఉండాలి.
• టీస్పూనుల చక్కెర మరియు 1 టీస్పూను తేనె తో కలిపి పెదవులు 2 నిమిషాలు పాటు వారానికి ఒకసారి స్క్రబ్ చేయండి. నిర్జీవ చర్మ కణాలు తొలగి ఎండిన పొరలు లేని పెదవులు మీకు అందించటంలో సహాయం చేస్తుంది.
• మీ పెదవులు తేమగా ఉంచడానికి, రోజువారీ ఒకసారి లేదా రెండుసార్లు నులి వెచ్చని ఆలివ్ లేదా కొబ్బరి నూనె తో మీ పెదవులు మసాజ్ చేయవచ్చు.

3. పళ్ళ మరకలు, పసుపు రంగు – బేకింగ్ సోడా
అయితే, వంశానుగత కారణాలు, అధిక టీ లేదా కాఫీ సేవన, అధిక ధూమపానము, మరియు హార్డ్ (సబ్బు నురుగ రాని) నీటి వినియోగం పళ్ళును మరకలతో, వాటిని పసుపు రంగులోనికి మర్చవచ్చును.
• ఒక చిన్న బఠానీ గింజ పరిమాణం టూత్ పేస్టు, ¼ టీస్పూన్ బేకింగ్ సోడా తో కలపండి. వారానికి ఒకసారి, దానితో మీ పళ్ళు బ్రష్ చేయండి. బేకింగ్ సోడాలోని కరుకు దనం, పళ్ళ ఉపరితలాన్ని పోలిష్ చేసి మరకలను తొలగిస్తుంది. ఈ పరిహారం ఉపయోగించిన తర్వాత ఏదైనా త్రాగడంగాని, తినడంగాని ఒక గంట వరకు చేయరాదు.
• మరో మంచి ఎంపికగా నిద్రించే ముందు ఒక వారం రోజుల పాటు ప్రతి రాత్రి మీ పళ్ళు తాజా కమలా పండు పై తొక్క లోపల భాగంతో రుద్దండి. దీనిలోని బ్లీచింగ్ కాంపౌండ్సు పళ్ళ మీద పసువు రంగును తగ్గిస్తుంది.
• అలాగే, జుట్టుకు బ్రష్ ఉపయోగించటం నివారించండి ఇది శ్లేషపటలము క్షయము కలిసిన మిశ్రమమును మీ జుట్టు మూలాల నుండి, చివరలకు పంపిణీ చేస్తుంది, బేబి పౌడరు మీ చేతులకు రాసుకొని, మీ జుట్టు కుదుళ్ళకు రుద్ది ఆపై దువ్వెన్నతో సుతారంగా బ్రష్ చేయండి.

4. జిడ్డుగల జుట్టు కోసం బేబీ పౌడర్
జిడ్డుతో జుట్టు నిర్లక్ష్యం చేసినట్లు కనిపిచటమమే కాకుండా, చాలా వికారంగా కనిపిస్తుంది. అదనంగా, అది పేలవంగా ఉండి, చుండ్రు మరియు దురద ఎక్కువగా కలిగిస్తుంది. కొంచం జిడ్డుగల జుట్టు సమస్యలను సులభంగా మీ జుట్టు సంరక్షణ రొటీన్ మార్పులతో మరియు సాధారణ గృహ వైద్యం తో సరిచేయ్యవచ్చు.
ఉదాహరణకు, మీరు మరింత తరచుగా మీ జుట్టును గోరు వెచ్చని నీటితో శుభ్రపరచాలి. వేడి నీరు శ్లేషపటల క్షయము కలిసిన మిశ్రమము (sebum) యొక్క ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, అందువలన ముందు కంటే మీ జుట్టు అధికమైన జిడ్డుతో ఉంటుంది.

5. ఉబ్బిన కళ్ళకు చల్లని చెంచా
ఉబ్బిన కళ్ళు అలాగే కళ్ళ క్రింద నల్లని వృత్తాల సమస్య అనేక కారణాల వలన కలుగుతాయి. అత్యంత సాధారణంగా అధికంగా దుఃఖ్ఖం, అర్థరాత్రి వరకు పార్టీలు, అధిక ఒత్తిడి, జన్యుసంబంధ రీత్యా, శరీరంలో హార్మోన్ల మార్పులు, నిద్ర లేకపోవడం, తదితరాల వలన కలగవచ్చును.
• కొన్ని మెటల్ టీ స్పూన్లు 15 నిమిషాలపాటు లేదా అవి పూర్తిగా చల్లబడే వరకు రిఫ్రిజిరేటర్ లో ఉంచండి. 1 నిమిషం పాటు ఒక చల్లని స్పూను కాడ పట్టుకొని స్పూను భాగం ఉబ్బిన కళ్ళ భాగం మీద పట్టుకోండి. ఆది సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చాక మరొక చల్లని చెంచాతో పద్దతి పునరావృతం చేస్తూండండి. చల్లని ఉష్ణోగ్రత కళ్ళు చుట్టూ ఉన్న చర్మాన్ని సంకోచింపజేసి రక్త నాళాలకు విశ్రాంతి నిస్తుంది.
• మరొక ఎంపికగా ఉపయోగించిన గ్రీన్ లేదా బ్లాక్ టీ సంచులు 30 నిమిషాలపాటు రిఫ్రిజిరేటర్ లో చల్లబరచండి. 10 నిమిషాలపాటు మూసిన కనురెప్పలు మీద వాటిని ఉంచండి. కొన్ని సార్లు ఈ పరిష్కారం పునరావృతం చెయ్యండి. టీ సంచులు చికాకు లక్షణాలు మరియు వాపు తగ్గించే సహాయం చేస్తుంది. ఈ పరిష్కారం కంటి క్రింద ఏర్పడిన నల్లని వృత్తాలను కూడా నివారించే సహాయం చేస్తుంది.
• చక్రాలుగా తరిగిన చల్లని కీర దోసకాయ ముక్కలను 10 నిమిషాలు పాటు, రోజువారి కొన్ని సార్లు మూసిన కనురెప్పల మీద ఉంచండి. కీర దోసకాయల లోని రక్తస్రావ నివారిణి లక్షణం కళ్ళ చుట్టూ ఉన్న వాపును తగ్గిస్తుంది.

6. జిడ్డుగల చర్మం కోసం ఎగ్ వైట్స్
జిడ్డుగల చర్మం వారి వయసు తెలుసుకోవటం కష్టం, కానీ ఈ చర్మ తత్వం గలవారికి సౌందర్యం తీసుకురావటానికి అత్యంత శ్రమ, కష్టం తీసుకోవాలి. ఈ శరీర తత్వం అవసరమైన దాని కంటే ఎక్కువ చమురు ఉత్పత్తి చేయటం వలన, చర్మానికి ఒక మెరిసే రూపం వస్తుంది. అదనంగా, జిడ్డుగల చర్మ తత్వం కలవారికి మొటిమలు, మరియు బ్లాక్హెడ్సు (blackheads) సంభవిస్తుంటాయి. ఈ సమస్య తరచు మహిళలను నిలకడలేని హార్మోన్ల తో ప్రభావితం చేస్తుంది.
• జిడ్డైన ముఖాలను తాజాగా, మెరిసే ఛాయతో కాంతివంతంగా చేయటానికి రోజువారీ కొన్ని సార్లు సున్నితమైన ప్రక్షాళన ముఖం శుభ్రపరచడానికి అవసరం.
• గుడ్డు తెల్ల సొన, జిడ్డుగల చర్మం కోసం అత్యంత ప్రభావవంతమైన మరియు చవకైన నివారణలలో ఒకటి. ఇది అదనపు చమురు శోషించడానికి సహాయపడుతుంది మరియు జిడ్డుగల చర్మాన్ని టోనప్ చేయగలదు. 1 గుడ్డు తెల్ల సొనతో చర్మం మీద పూత పూయండి. పొడిబారిన తరువాత గోరు వెచ్చని నీటితో ముఖం కడగండి. వారంలో రెండుసార్లు ఈ పరిహారం అనుసరించండి. ఐచ్ఛికంగా, సగం నిమ్మకాయ రసం, ముఖానికి పూత వేసే ముందు గుడ్డు తెల్ల సొన లో కలపవచ్చును.
• మరో సాధారణ పరిష్కారంగా చర్మం మీద సగం టమోటా రుద్దండి. టమోటా రసం దాని పని చేయడానికి, 15 నిమిషాల పాటు వేచి ఆపై చల్లని నీటితో చర్మం శుభ్రం చేయండి. ఈ పరిష్కారం వారంలో 2 లేదా 3 సార్లు ఉపయోగించండి. టమోటా లోని సహజ నూనె శోషక గుణం అదనపు చమురును పీల్చుకునే సహాయం చేస్తాయి.

7. మిక్కిలి పొడిబారిన చర్మం కోసం కొబ్బరి నూనె
పొడిబారిన చర్మం ఒక అసౌకర్య పరిస్థితి. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వలన దురద, పొడి చర్మం వలన కలిగే మచ్చలకు, చర్మం పొరలుగా ఊడడం మరియు పగుళ్లకు కారణమవుతుంది. దురద పుట్టినప్పుడు గోకడం ఉండటం కష్టం కావచ్చు, గోకడం వలన చర్మ పరిస్థితి మరింతగా పాడు కావచ్చును.
తీవ్ర వాతావరణ పరిస్థితులు; ఎక్కువ గంటలు ఎండలో గడపటం; సుదీర్ఘ వేడి నీటి స్నానాలు; క్లోరినేటెడ్ కొలనులలో ఈత; తేమలేని గట్టి సబ్బుల వినియోగం, డిటర్జెంట్ల వినియోగం; వలన పొడి చర్మం సంభవించటానికి కొన్ని కారణాలు. ఇవన్ని చర్మం లోని తేమను హరిస్తాయి.
పొడి చర్మం ఉపశమనానికి, సరైన తేమ చర్మానికి తప్పనిసరి. దీని కోసం, ఖరీదైన తేమ కలిగించే క్రీములు మరియు లోషన్ల మీద ఖర్చు చేయనవసరం లేదు. తేమ కలిగించి ప్రభావవంతమైన ఫలితాలు ఇచ్చే అనేక సహజ దినుసులు మీ వంటగది లో ఉన్నాయి.
• స్నానం తర్వాత రోజువారీ, మీ చర్మం పై ముడి కొబ్బరి నూనె (ఏ పదార్ధాలు కలపని) రాయండి. అధికంగా పొడిబారిన చర్మం కోసం ఎంతో ప్రయోజనకరంగా ఉంటంది. మీ చర్మం కొంతవరకు తడి ఉన్నప్పుడు తేమ చర్మంలో లాక్ అవుతుంది ముఖ్యంగా ఒక స్నానం తరువాత నూనె రాయటం మంచిది.
• పొడి చర్మానికి మరో మంచి సహజ తేమ కలిగించే పదార్ధం తేనె. ఇది చర్మం పొడిగా ఉండటాన్ని తగ్గించి మరియు చర్మం మృదువుగా మరియు సౌకర్యవంతంగా ఉంచాటానికి తేమను లాక్ చేయటంలో సహాయపడుతుంది. స్నానం చేసే ముందు, మీ శరీరం మీద తేనె రుద్దండి 10 నిమిషాల పాటు వేచి ఉండి, ఆపై స్నానం చేయండి రోజువారీ ఒకసారి పునరావృతం చేయండి. ఇది చవక పరిష్కారం కాదు, ఖర్చు ఎక్కువే, కానీ క్రీములు, లోషన్లు తో పోల్చినపుడు వాటి కంటే చవక, అదనంగా ఎటువంటి దుష్ప్రభావాలు లేనిది.

8. బ్లాక్హెడ్సు (blackheads) కోసం బేకింగ్ సోడా
యుక్త వయసు అమ్మాయిలు ఎదుర్కొంటున్న మరో సమస్య, అడ్డుపడే చర్మ రంధ్రాల వలన కలిగే బ్లాక్హెడ్సు (Blackheads). చిన్న ముదురు రంగు లేదా నలుపు పొక్కులవలె, ప్రధానంగా ముక్కు మరియు నుదిటి మీద కనిపిస్తాయి. జిడ్డుగల చర్మం కలిగిన వారి శరీరంలోని హార్మోన్ల మార్పులు, ఈ సమస్యకు కారణమవుతాయి. చర్మ సంరక్షణ నైపుణ్యం కలిగిన చర్మవ్యాధి నిపుణులు blackheads నివారణకు రసాయన peels మరియు ప్రిస్క్రిప్షన్ చికిత్సలు ఉపయోగిస్తారు. కానీ ఈ రెండు ఎంపికలు ఖరీదైనవి.
• బ్లాక్ హెడ్స్ కు ఉత్తమ మరియు చౌకైన నివారణలలో బేకింగ్ సోడా ఒకటి. బేకింగ్ సోడా, కొద్దిగా నీటి తో కలిపి పేస్ట్ చేయండి. ప్రభావిత ప్రాంతం మీద పూయండి, కొన్ని సెకన్ల పాటు మీద వదిలి అప్పుడు శుభ్రం చేయండి. ఈ పరిహారం వారం లో ఒకసారి లేదా రెండుసార్లు ఉపయోగించండి.
• 2 టేబుల్ స్పూనుల వోట్మీల్, 3 టేబుల్ స్పూనుల సాదా పెరుగు, మరియు కొద్దిగా నిమ్మ రసం తో ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకొని. ముఖానికి పూసి, 5 నిమిషాల పాటు వేచి ఉండి, ఆపై తడి చేతులతో పేస్ట్ శుభ్రం చేయండి. ఆపై గోరు వెచ్చని నీటితో ముఖం శుభ్రం చేయండి. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు పునరావృతం చేయండి.

9. కొబ్బరి నూనె మరియు నిమ్మ రసం చుండ్రు నివారణకు
చుండ్రు మరొక ఇబ్బందికరమైన సమస్య. ఇది ఏ వయసు వారినైనా బాధ పెట్టే చాలా సాధారణ సమస్య, కానీ ఎక్కువగా 20 సంవత్సరాల లోపు వయసు వారికి కలుగుతుంది. చుండ్రు, తల చర్మం నుండి వెలువడిన నిర్జీవమైన పొడి పొరలు. ఈ పొరలు ముదురు రంగు దుస్తులు వేసుకున్నప్పుడు, వాటి మీద రాలి చాలా ఇబ్బంది కి కారణమవుతాయి. చుండ్రు తల మీద దురద మరియు జిడ్డు కలుగచేస్తాయి.

10. కొన్ని సాధారణ సహజ గృహ నివారణలు.
• సగం నిమ్మకాయ రసం తో పావు కప్పు వెచ్చని కొబ్బరి నూనె కలపండి. దీనితో జుట్టు కుదుళ్ళలో మసాజ్ చేయండి. 30 నిమిషాల పాటు వేచి, ఆపై జుట్టును శుభ్రపరచండి. ఈ పరిహారం వారానికి రెండు సార్లు ఉపయోగించండి.
• గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. రోజు విడిచి రోజు ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటే చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. అంగుళం పరిమాణంలో క్యారెట్ ముక్క, సగం బంగాళదుంప ముక్క కలిపి ఉడకబెట్టి, గుజ్జులా చేయాలి. దీంట్లో చిటికెడు పసుపు, బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ముడతలు తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది.
• రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, ఒక చుక్క గ్లిజరిన్, 2 చుక్కల నిమ్మరసం కలపాలి. దూది ఉండతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి. ఇది ఇంట్లో చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అంతేకాదు, చర్మముడతలు పడదు. యవ్వనకాంతితో మెరుస్తుంది సాగకుండా సొగసుగా..!
• వయసు పెరుగుతున్నా… నవయౌవనంగా కనిపించాలంటే చర్మంలో సాగే గుణం తగ్గకూడదు. అలాంటి సొగసును సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా…• సి విటమిన్ తీసుకోవాలి…
• అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం విటమిన్ సి ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మంలో ముడతల ప్రభావం చాలా ఆలస్యంగా మొదలవుతుంది. కొలాజిన్ ఉత్పత్తిలో ఈ పోషకం కీలకంగా పనిచేస్తుంది. ఇందుకోసం క్యాప్సికం, ఆకుకూరలూ, మొలకలూ, టొమాటోలూ, కమలాఫలాలూ తీసుకోవాలి. పోషకాల ఆధారితంగా తయారుచేసిన సౌందర్య ఉత్పత్తుల్ని వాడాలి.

ఎండకు దూరంగా….
• కొలాజిన్ తగ్గిపోవడానికి ఎండలోని అతినీలలోహిత కిరణాలు కూడా కారణమే. కాబట్టి బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా చర్మతత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్‌లోషన్‌ని రాసుకోవాలి. ఎండ తక్కువగా ఉన్నా సరే ఈ జాగ్రత్త పాటించాలి. అలాగే తీపిశాతం ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల వృద్ధాప్యపు చాయలు త్వరగా మొదలవుతాయి. దాంతో చర్మంలో సాగేగుణం తగ్గి ముడతల్లాంటివి మొదలవుతాయి. చర్మంపై పేరుకొన్న మృతకణాల్ని తొలగించడం వల్ల కొలాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో వృద్ధాప్యపు చాయలు రావడం ఆలస్యమవుతుంది.

ఈ పోషకాలు అవసరం….
• చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందేలా చూసుకోవాలి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా మారుతుంది. దీనికోసం గ్రీన్ టీ తాగొచ్చు. అలాగే పాలకూర తీసుకోవచ్చు. వయసుపెరిగేకొద్దీ ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గుతాయి. దాంతో కూడా కొలాజిన్ పనితీరు మందగిస్తుంది. ఈ సమస్యను అధిగమించాలంటే నట్స్, సోయా లాంటివి ఎంచుకోవాలి. ఫైటో ఈస్ట్రోజెన్లు ఎక్కువగా ఉండే క్రీంలు వాడాలి.
• వయసు పైబడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు ఏర్పడటం సహజం. దీనిని నివారించడానికి చాలామంది తరచూ బ్యూటీపార్లర్‌కి వెళుతూ ఉంటారు. యాంటీ ఏజింగ్ క్రీములు రాయడం, ట్రీట్మెంట్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇలా ముదిమి ఛాయలు కనపడకుండా ఎవరికి తోచిన రీతిలో వారు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మరింత యవ్వనంగా కనిపించవచ్చు. మరి నిత్య యవ్వనంగా మెరిసిపోవడానికి ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాల్సిన కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందామా…

ఉసిరి…
• ఉసిరిలో విటమిన్ ‘సి’ అధికంగా లభిస్తుంది. అలాగే చర్మపోషణకు అవసరమైన ఖనిజపదార్థాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. దీనిలోని పోషకాలు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల చర్మానికి సరైన పోషణ అందుతుంది. ఫలితంగా చర్మం ముడతలు పడటం తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది. ఉసిరిని తినడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

సాల్మన్ చేప…
• సాల్మన్ చేపలో ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలు చర్మ కణాలపై పొరలా ఏర్పడి అవి పాడవకుండా చేస్తాయి. అందుకే వారానికి రెండు సార్లు ఈ చేపను ఆహారంగా తీసుకోవాలి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది.

ఆలివ్ ఆయిల్…
• ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి, అందానికి మేలు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. దీనిలో ఉన్న పాలీఫినాల్స్, యాంటీఆక్సిడెంట్లు, మోనోశ్యాచురేటెడ్ కొవ్వుల వల్ల వయసు మీద పడుతున్న ఛాయలు దగ్గరకి రావు. అందుకే వంటల్లో ఆలివ్‌నూనెను కూడా చేర్చుకోవాలి. అలాగే అప్పుడప్పుడు ఆలివ్ నూనెతో చర్మాన్ని మర్దన చేసుకుంటూ ఉండాలి.

డార్క్ చాక్లెట్…
• సూర్యరశ్మి, అతినీల లోహిత కిరణాల ప్రభావం వల్ల కూడా చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతుంది. కొకొవా బీన్స్‌తో తయారు చేసిన డార్క్ చాక్లెట్ ఈ ప్రభావాన్ని కాస్త తగ్గిస్తుంది. దీనిలో లభించే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తాయి. అలాగే ఇది చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతుంది. ఫలితంగా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

గింజలు…
• బాదం, జీడిపప్పు, పిస్తాలాంటి గింజలను తినడం ద్వారా అన్శ్యాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల ఆరోగ్యంగానే కాదు… అందంగానూ తయారవ్వచ్చు. అయితే వీటిని మరీ ఎక్కువగా తినడం వల్ల లావయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మోతాదు మించకుండా జాగ్రత్త పడాలి.

వెల్లుల్లి…
• వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు రక్తాన్ని శుద్ధి చేసి చెడు కొలెస్ట్రాల్‌ని బయటకు పంపిస్తాయి. ఫలితంగా ముఖం మీద వచ్చే ముడతలు తగ్గుముఖం పడతాయి. కొందరిలో బరువు తగ్గడం వల్ల చర్మం సాగినట్లుగా అవుతుంది. తిరిగి దాన్ని బిగుతుగా మార్చడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది.

మరికొన్ని…
* రోజూ సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల రక్తం శుద్ధిపడుతుంది. అలాగే చర్మానికి కావల్సిన తేమ కూడా అందుతుంది.
* గ్రీన్ టీ తాగడం వల్ల చర్మ కణాలు పునరుత్తేజితం చెందుతాయి. దీనివల్ల కూడా ముడతలు తగ్గుతాయి.
* బీన్స్‌లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తాయి.
* నారింజ జాతి పండ్లలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే విటమిన్ ‘సి’ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి వీటిని రోజూ తింటూ ఉండాలి


@  Subbarao Kasturi

Source: Top10homeremedies

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.