ధూమపానం (Smoking) మానడానికి గృహవైద్యం

0
853

ధూమపానం ఒక వ్యసనం, అది మొత్తం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అమెరికన్ లంగ్ అసోసియేషన్ ఆధ్యాయనాల ప్రకారం, మూడోవంతు క్యాన్సర్ మరణాలు మరియు నాలుగోవంతు ప్రమాదకరమైన గుండె దాడులు కలిగిస్తుందని తెలిపాయి.

ధూమపానానకి ప్రధాన కారణాలు, హోదా గుర్తుగా, సామాజిక ప్రవర్తన, ఒత్తిడి లేదా ఇబ్బందికరమైన పరిస్థితులు, మీడియా ప్రభావాలు, మరియు తోటివాళ్ళ ఒత్తిడి అవవచ్చును.సిగరెట్ లో గల నికోటిన్, వ్యసనపరుని గా మార్చి మరింత ధూమపానం చేయాలనే కోరికను కలిగిస్తుంది. పొగ పీల్చడం వలన అనేక ఆరోగ్య సమస్యలు అనగా శ్వాసకోశ, పెరిగిన రక్తపోటు, గుండె రేటు, క్షీణించిన వ్యాధి నిరోధక వ్యవస్థ, పురుషుల్లో తక్కువ వీర్యకణాల సంఖ్య, మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణమవుతుంది.

ధూమపానం చేయని వారు కూడా వదలిన సిగరెట్ పొగ పీల్చడం వలన వ్యాధులు కలుగుతాయని నమ్ముతున్నారు. దీనిని స్తబ్ద ధూమపానం అని పిలుస్తారు. ధూమపానం మానిన మొదట్లో, నిరాశ, ఆందోళన, కోపం, ఏకాగ్రత లేకపోవడం, ఆకలి పెరుగుట, తలనొప్పి, అధిక రక్తపోటు మరియు తిరిగి పొగ త్రాగాలనే కోరిక వంటి ఉపసంహరణ లక్షణాలు అనుభూతి లోకి వస్తాయి.

ధూమపానం మానడానికి, మానినందు వలన వచ్చే ఉపసంహరణ లక్షణాలకు డాక్టరు సలహపై నికోటిన్ ప్రత్యామ్నాయం ఉత్పత్తుల మందులు వాడవచ్చును లేదా సహజ గృహ వైద్య పద్దతులు ఎంచుకోవచ్చును. ఇక్కడ ధూమపానం మానుటకు 10 సహజ గృహ వైద్య పద్దతులు ఉన్నాయి. వీటిని మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత (health care provider) పర్యవేక్షణలో అనుసరించుట ముఖ్యమని గమనించాలి.

1. కట్టుపోకల (Lobelia)
కట్టుపోకల శరీరంలో నికోటిన్ యొక్క ప్రభావాలు తగ్గించడానికి సహాయం చేసే ఔషదం. ఇది లొబొలీన్ అనే చురుకైన పదార్ధం ఉత్పత్తిచేస్తుంది, ముఖ్యంగా న్యూరోట్రాన్స్మిటర్ డోపమైన్ విడుదల చేస్తుంది. కట్టుపోకల, వెనిగర్ టింక్చర్ రూపంలో మార్కెట్ లో అందుబాటులో ఉంది. సాధారణ మోతాదు 20 – 60 చుక్కలు రోజువారీ మూడు సార్లు వినియోగించాలి. ఇది మూడు నుంచి ఐదు చుక్కల వంటి తక్కువ మోతాదు తో ప్రారంభించి క్రమంగా మోతాదు పెంచడం ఉత్తమ పద్దతి. కట్టుపోకల అత్యంత విషపూరిత పదార్థం, ఒక అర్హతగల వైద్యుని పర్యవేక్షణలోనే ఈ మూలికల వాడకము జరగాలి. ఈ విషయము గమనించి శ్రద్ధ తీసుకోవలెను.

ముఖ్య గమనిక: గుండె జబ్బు లేదా రక్తపోటు ఉన్నవారు, గర్భిణీ, పాలిచ్చే మహిళలు మరియు పిల్లలు ఈ మూలిక వాడరాదు.

2. అతి మధురం (లికోరైస్)
అతి మధురం సహజంగా ధూమపానం మానుటకు సహాయం చేసే ఒక కఫహరమైన మరియు బాధను తగ్గించే, మరియు కొద్దిస్థాయి తీపి రుచిగల హెర్బు. ఇది పొగత్రాగాలనే తపన చంపడానికి సహాయపడుతుంది. ఇది ధూమపానం వల్ల వచ్చే దగ్గును తగ్గిస్తుంది. ఈ హెర్బ్ ఒక అడ్రినల్ టానిక్ మరియు కార్టిసాల్ (cortisol) స్థాయిలు సమతుల్యం చేస్తుంది, అలసట తగ్గించడానికి మరియు శక్తి పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.

అతి మధురం వేరు ఒక చిన్న ముక్క చప్పరిండం ద్వారా పొగ త్రాగాలనే కోరికను సంతృప్తి పరుస్తుంది. అతి మధురం వేరు టీ రోజుకు రెండు లేదా మూడు సార్లు త్రాగవచ్చు.

గమనిక: అతి మధురం, మధుమేహం, అధిక రక్తపోటు, అడ్రినల్ వ్యాధి లేదా తగ్గిన మూత్రపిండాల లేదా కాలేయం పనితీరు ఉన్నవారు ఉపయోగించరాదు.

3. ఎర్ర మిరపకాయ (Cayenne Pepper)
ఎర్ర మిరపకారపు పొడి ప్రతిక్షకారిని (antioxidant) కలిగి పొగాకులోని రసాయన ప్రకోపనకారులను, శ్వాస వ్యవస్థను desensitizes చేసి, ధూమపానం వల్ల కలిగే నష్టం నివారించి క్రమంగా, ఊపిరితిత్తుల మెంబ్రేన్లలో స్థిరీకరణ కలిగిస్తుంది.

ధూమపానం నుండి నిష్క్రమించడానికి, దీనిని తాజా మిరప కాయలుగా, మిరప పొడిగా, గుళికలుగా లేదా మిరప టీ తో సహా వివిధ రూపాల్లో ఉపయోగించవచ్చు. అయితే, ఒక గ్లాసు నీటికి, రెండు చిటికెల కారపు పొడి కలిపి రోజువారీ తాగడమే ధూమపానం చెయ్యాలన్న తపన తగ్గించటానికి ఉత్తమమైన ఎంపిక.

4. సెయింట్ జాన్ వోర్ట్
సెయింట్ జాన్వోర్టు- ఇతర సాధారణ పేర్లు అంబర్ టచ్-అండ్-హీల్, గోట్ వీడ్, హైపరికం, జాన్స్వర్ట్, క్లామత్ వీడ్, రోజిన్ రోజ్, సెయింట్ జాన్ గ్రాస్ మరియు టిప్టన్ వీడ్. హిందీ: చోలి ఫుల్యా • తమిళం: వెట్టాయ్ పాక్కు, తెలుగు పేరు దొరక లేదు.

ఈ ఔషధ మూలికల ధూమపానం వైదొలిగించుటలో సహాయపడుతుంది. ఈ హెర్బ్ ధూమపానం త్యజించడం వలన కలిగే ప్రయోగాత్మక ప్రభావాలు మరియు ఒత్తిడి పోరాడటం లో సహాయం అందించి ప్రశాంత లక్షణాలు అందిస్తుంది.

నిజానికి, నికోటిన్ ఉపసంహరణ సమయంలో, నిస్పృహ (డిప్రెషన్తో) తో బాధపడుతున్న వారి వంటి ఆందోళన మరియు ఒత్తిడి అనుభవంలోకి వస్తున్నట్లు గమనించబడింది. ఈ ఔషదం నికోటిన్ నిస్పృహ రాకుండా, ఉపసంహరణ సమయంలో వచ్చే లక్షణాలను నివారిస్తుంది.

ఒక ప్రయోగాత్మక అధ్యయనంలో, రోజూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిగరెట్లు ధూమపానం చేసిన 24 మందికి, రోజూ రెండుసార్లు రోజువారీ సెయింట్ జాన్ వోర్ట్ గుళిక (capsule 450 మి. గ్రా.) ఇచ్చారు. 24 మందిలో తొమ్మిది మంది 12 వారాల తరువాత, ధూమపానం విరమణ చేయగలిగారు. ఈ అధ్యయనం ఎంతవరకు ఉపయోగపడిందని ఇదమిద్దంగా అవగాహనలోకి రాలేదు. కాబట్టి, తదుపరి పరిశోధన ఈ విషయంలో అవసరం.

గమనిక: ఈ హెర్బ్ తీసుకునే ముందు మీ డాక్టర్ ను సంప్రదించండం అతి ముఖ్యమని గమనించాలి, సెయింట్ జాన్ వోర్ట్ గర్భవతి లేదా పాలిచ్చే మహిళలు ఉపయోగించరాదు.
గర్భవతి లేదా పాలిచ్చే మహిళలని వ్రాయటంలోని అర్ధం, ఈ మూలిక తదితర వ్యాధుల నివారణ ఔషధంగా మహిళలలు ఈ సమయంలో వాడరాదు.

5. గ్రీన్ వోట్స్
గ్రీన్ వోట్సును అవెనా సటైవా లేదా అడవి వోట్స్ అని పిలుస్తారు. ధూమపానం విడిచి పెట్టుటకు సాయపడే ఒక సమర్థవంతమైన మూలికా చికిత్స. 1971 జరిపిన అధ్యయనం లో గ్రీన్ వోట్స్, నికోటిన్ కోసం కలిగే కోరికను తగ్గించేందుకు మరియు ఉపసంహరణ లక్షణాల ప్రభావాలను తగ్గించుననీ కనుగొనబడింది. ఇది ఉపసంహరణ ప్రక్రియ సమయంలో నికోటిన్ నిర్విషీకరణను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

గ్రీన్ వోట్సు నిద్రనిచ్చే ప్రభావంతమైన ఒక టానిక్ అలాగే నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ధూమపానం విడిచిపెట్టడానికి పోరాడుతున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
గ్రీన్ వోట్సు గుళికలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మీరు సురక్షితంగా రోజువారీ గ్రీన్ వోట్స్ 300 మి. గ్రా. వరకు వాడవచ్చును, కానీ మీ పరిస్థితికి అనుగుణంగా పరీక్ష ఫలితాలను పర్యవేక్షించి ఇచ్చే సరైన మోతాదు కోసం వైద్యుడను సంప్రదించడం అవసరమని గమనించండి.

6. జిన్సెంగ్ (జిన్సెంగ్)
జిన్సెంగ్ ధూమపానం చేయాలనే కోరికల యొక్క తరచుదనం తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది అడ్రినల్ గ్రంథులకు ఒక టానిక్ పరిగణించబడింది మరియు అది రక్తప్రవాహంలో సరైన కార్టిసాల్ స్థాయిలు పునః స్థాపితం చేయటానికి తోడ్పడుతుంది.

ఉపసంహరణ లక్షణాలు ఎదుర్కొంటున్నప్పుడు జిన్సెంగ్ భౌతిక మరియు మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయపడుతుంది మరియు శరీరంలో సంతులనం పునరుద్ధరిస్తుంది. ఇది ఏకాగ్రతను చురుకు చేసి మూడును మెరుగుపరుస్తుంది మరియు ఆతురత, మానివేయడంలో కలిగే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటంలో సహాయం చేస్తుంది.

మీ అల్పాహారంలో లేదా ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూను జిన్సెంగ్ పొడి వేసి త్రాగితే ధూమపాన తృష్ణ తగ్గించేందుకు సహాయం చేస్తుంది. ఎండిన జిన్సెంగ్ ఒక చిన్న మొత్తంలో చప్పరించి మరియు రసం మింగవచ్చును.

గమనిక: మీరు గుండె సమస్యలు, మధుమేహం, రోగనిరోధక లోపం, స్కిజోఫ్రేనియా లేదా హార్మోన్ సెన్సిటివ్ పరిస్థితితో బాధపడుతుంటే జిన్సెంగ్ తీసుకోరాదు.

7. జఠామాంసి (Valerian)
జఠామాంసి ఒక పుష్పించే మొక్క, ధూమపానం విడిచే సమయంలో ఆందోళనకు వ్యతిరేక ఉపశమన ఔషధంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ మూలిక మెదడులో GABA గ్రాహకాలతో (receptors) సంకర్షణ (to interact) అయి శాంత పరచి కోరికలను అరికట్టడానికి ఉపశమన ప్రభావం చూపుతుంది.
జఠామాంసి, చిరాకు, నిరాశ, విశ్రాంతి లేకపోవటం మరియు ఆతురత వంటి వాటికి, ఉపసంహరణ లక్షణాలను నివారించేందుకు సహాయపడుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, జఠామాంసి వలన మరింత విశ్రాంతి దాయకమైన నిద్రను పొందుతారని తెలిసింది.

ఈ మూలిక గుళిక, పొడి మరియు కాషాయపురంగు రూపాల్లో అందుబాటులో ఉంది. కానీ మీ వైద్యుని యొక్క మార్గదర్శకత్వంలో జఠామాంసి తీసుకోవాలి.

8. తెల్ల జుమికి (Passion Flower)
ధూమపానం విరమణ వెంబడించే ఆందోళన మరియు చిరాకు పోరాడటానికి సహాయపడుతుంది, విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఇది ఉపసంహరణ కాలంలో నిద్రలేమి మరియు విశ్రాంతి లేకపోవడం, నికోటిన్ కోరికలను తగ్గించడానికి సహాయపడుతుంది

మీరు టీ, టింక్చర్ లేదా క్యాప్స్యూల్ రూపంలో తెల్ల జుమికిని తీసుకొనవచ్చును. అయితే, ఇతర మూలికలు వలె, డాక్టరు పర్యవేక్షణ కింద ఈ హెర్బ్ తీసుకోవడం అతి ముఖ్యంగా గమనించాలి. గర్భవతులు మరియు తల్లిపాలనిచ్చే మహిళలకు సిఫార్సు లేదు.

9. ఆక్యుపంక్చర్
ఆక్యుపంక్చర్ ధూమపాన నిష్క్రమణకు సహాయపడుతుంది. ఆక్యుపంక్చరిస్టు చెవిలో ఐదు ఆక్యుపంక్చర్ పాయింట్లలో సన్నని సూదులను ప్రవేశ పెట్టి ఉపసంహరణ లక్షణాలను అదుపులో తెస్తాడు. అది డెటాక్సిఫికేషన్ ప్రక్రియకు సహాయపడుతుంది.
ఆక్యుపంక్చరిస్టు క్వాలిఫైడ్ డాక్టరు అయితేనే చికిత్స చేయించుకోవాలి.

10. చెవి మసాజ్
చెవి మసాజ్ నికొటిన్ కోరికలను ఆదుపులో తెచ్చే మరొక మార్గం. చెవులు ధూమపానం వదిలిపెట్టడంలో సహాయపడే శరీర కీలక ప్రాంతంగా భావిస్తారు. మీరు చెవుల మసాజ్, క్రమంగా పొగ తపన తగ్గించే ఆక్యుపంక్చర్ పాయింట్లను, ప్రేరేపిస్తుంది. రోజువారీ రెండు నిమిషాలు మీరే చెవి మసాజ్ ఇవ్వడం వలన పొగ తపన తగ్గించడానికి సహాయపడుతుంది.

ఈ సహజ నివారణలు మీరు ధూమపానం విడిచి పెట్టడానికి సహాయం చేస్తాయి. కానీ, బలమైన మానసిక కాంక్ష మీ అలవాటును విచ్ఛిన్నం చేయుటలో సహాయపడే అత్యంత ముఖ్యమైన విషయంగా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ధూమపాన విసర్జన సమయంలో కలిగే శరీరక మూర్పులకు అనుగుణంగా కావలసిన మందలు ఇచ్చుటకు తదితర పర్యవసానములను తొలగించటకు మీ డాక్టరు పర్యవేక్షణ అతి ముఖ్యమని గమనించగలరు.

మీ విజయవంతమైన ధూమపాన విసర్జన అనంతరం సరైన ఆహారం, వ్యాయామం, ధ్యానం మరియు తగినంత నిద్ర అవసరం.


Subbarao Kasturi

Source: Top10homeremedies

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.