అమ్మా నాన్నలకో లేఖ…

0
694

అమ్మా మేమెంత ఎదిగినా నీకింకా చిన్నరి పాపలమే మేమెప్పుడూ..
మేము ఇలా రాయలని కానీ..రాయవలసి వస్తుందని కానీ ఎప్పుడూ అనుకోలేదు.
కానీ తప్పకుండా ఈ భావలని మీతో పంచుకోవాలి.
మేమెంత పెద్దవారిమయినా పెళ్ళిళ్ళు అయి పిల్లలు ఉన్నా..ఇంకా మా బాల్యపు జ్ఞాపకాలు మమ్ము వీడలేదు.

ఇప్పుడేమిటి ఇలా ఇంత పెద్ద ఉత్తరం అన్న మీ అలోచనలు పక్కన పెట్టి నాతో రండి.

గుర్తుందా మేము స్కూలుకు వెళ్ళే రోజుల్లో అందరూ స్కూల్కి రిక్షా లోనో బండిపైనే వెళ్ళేవారు.
స్కూలు కొంచెం దగ్గరని మేమెప్పుడూ నీతోనే నడిచే..
ఎందుకమ్మా ఇలా..మేము రిక్షవ్లో వెళతాము అంటే నవ్వుతూ..నేనున్నా కదా అనేదానివి.

నీకూ నడక తప్పుతుంది కదా అని తమ్ముడంటే…
వాడికో ముద్దు పెట్టి బాగులు తీసుకుని కొత్త కొత్త విషయలు చెబుతూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం.
అప్పుడు మాకు ఎలా చెప్పాలో తెలియక అలా చేసేదానివేమో కదా..
ముగ్గురం ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరేవారం.
ఎన్ని నవ్వులో గుర్తున్నాయా..ఎగిరే పక్షులను చూసి మనకీ రెక్కలుంటే ఎంత బావుండు అనేవాళ్ళం.

ఆ చిట్టి చేతులని అలా గాలిలో లేపి…
ఇవే మన రెక్కలు మన అలోచనలే ఆకాశం అంటే ఊఊ అంటూ ఆడే అల్లరి ఆట.
ఆనాడు మాకర్ధం కాలేదు కానీ ఈ రోజు అర్ధమయింది
బాల్యo ఎప్పుడూ పక్షిలాంటిదే..ప్రతీ అనుభవం అంబరాన్నంటినంత ఆనందం.

మన ఇల్లు ఇది నిజంగా మమతానురాగాల ఆనవాలు కదా..
అప్పుడప్పుడూ భిన్నాభిప్రాయాలు ఉన్నా..
సర్దుకుంటూ నువ్వు సమన్వయ పరుస్తూ నాన్న .
అంతా మనమంచికే అంటూ నవ్వేసే తాతయ్య నానమ్మ…గువ్వల్లాంటి మేము.
పక్కనే ఉండే చిన తాతలూ..చిన్నాన్నలు,పెదనాన్నలూ..వారి పిల్లలూ..
అపుడ్ప్పుడూ వచ్చే మేనత్తలూ..ఎంతో హడావిడిగా ఉండేది మన ఇల్లు.

అందరూ పిల్లలని చదువులకోసం పట్నాలు పంపిస్తుంటే మమ్మల్ని మాత్రం
నాన్నగారు పక్క ఊరిలో ఉండే స్కూలుకు తీసుకెళ్ళేవారు.
పట్నంలో చేర్పించండని చెప్పిన వారికి నాన్న నవ్వే సమాధానం.
నాన్నతో ఆ ప్రయాణం ఎంత సంతోషమో..
ఎన్నెన్ని కబుర్లో..చెట్టూ-చేమా..గాలీ-నీరూ..విజ్ఞానం-వినోదం ఇలా ఎన్నెన్నో మా మాటల్లో దొర్లిపోతుండేయి.

తప్పుచేస్తే శిక్షించినా తరువాత మారం చేసే మమ్మల్ని బుజ్జగించి లాలించటం ఎప్పటికీ మరువలేము.
అందరూ వీడియో గేంస్ ఆడుతుంటే మేము మాత్రం మమతల ఊయలలో ఊగుతుండే వాళ్ళం.
కలసి మెలసి ఉండటం..

నలుగురితో ఉంటూనే మాకంటూ ఓ వ్యక్తిత్వం ఏర్పడేలా సూచించే మీ మాటలు.
ఎందరిలో ఉన్న విలక్షణంగా నిలబెట్టే మా అలోచనలకు నాంది కూడా మన ఇల్లే.
తప్పొప్పులని ఎంచక పరిస్థితులను చూపిన వైనం..
వాటి నుండి బయటికి రాగలిగే ఆత్మవిశ్వాసాన్ని మాలో నింపడం.

పై చదువులకు బయటకు వెళ్ళినా మన ప్రపంచాన్ని మాత్రం మరువలేదు.
కొన్ని సార్లు తప్పు చేసినా దాన్ని దిద్దుకుని ముందుకు సాగమని మీరు చెప్పిన ఆనాటి మీ మాటలు ఇప్పటికీ మాకు స్పూర్తే.

బంధాలకీ ఆప్యాతలకీ కొలమానం డబ్బే అయిన నేటి రోజుల్లో
డబ్బును కేవలం వస్తువుగా వాడాలనీ..
అదే జీవితం కాదని నేర్పిన పాఠం ఇప్పటికీ గుర్తే.
త్రుప్తిని,ఆప్యాతనీ,విలువనూ,గౌరవాన్నీ ఎంత డబ్బు ఇచ్చినా కొనలేమనీ,
ప్రేమ పంచితే పెరుగుతుంది…దుఖ్ఖం తగ్గుతుందనీ.. నేర్చుకున్న విలువల పాఠం.

తెలిసిన స్నేహితులను వృద్ధాశ్రమంలో చేర్చిన రోజున ననమ్మా తాతయ్యను ఊరడిస్తూ..
మీరెప్పటికీ మాకెక్కువ కాదు.ఉన్నదానిలోనే త్రుప్తిగా ఉందాం.
అన్ని వెసలుబాట్లూ కల్పించలేకపోయినా మీ ముఖంపై నవ్వును మాత్రం చెరగనీయనన్న మీ మాటలు.
దేశాలు వదిలి ఆస్తులు సంపాదిస్తేనో అంతస్థులు కట్టిస్తేనో గొప్ప కాదని మేము తెలుసుకున్న సత్యాలు.
ఇప్పుడు మా పిల్లలకీ ఇవే నేర్పుతున్నాం..మీలానే మేమూ పెంచుతాం.

మీ ప్రేమలన్నీ కలబోసుకున్న ప్రాణాన్ని నవ మాసాలు మోసి మీలో భాగంగా ఉండి మమ్ము
కన్నప్పుడు బొడ్డు కోసి వేరు చేసినా తల్లిదండ్రుల ప్రాణాలెప్పుడూ పిల్లల మీదే..

ఇట్లు
మీ పిల్లలు.


@తులసి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.