రుగ్మతలు-నివారణలు 2

0
624

ఒక సంవత్సరం లోపు శిశువులకు విధంగానూ తేనె ఇవ్వరాదని తెలుసుకోండి.

డస్ట్ ఎలేర్జి:

 • వాము మెత్తగా దంచి పలుచని గుడ్డలో మూటగట్టి, దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని, అనేక సార్లు వాసన చూస్తూ ఉంటె దుమ్ము వలన, తాలింపు వలన, ఘాటు వాసన వలన కలిగే ఎలేర్జి రాకుండా నివారిస్తుంది.
 • తులసి ఆకు నీడలో ఎండ బెట్టి, పొడి చేసి, పలుచటి గుడ్డలో వస్త్రఘాలితం పట్టి నిలువ చేసుకొని, రోజువారి 2 – 3 పూటలు కొంచెం పొడి ముక్కు పొడిలా పీలుస్తూ ఉంటే ఎలేర్జి రాకుండా నివారిస్తుంది.
 • శొంఠిని దోరగా వేయించి, దంచి జల్లెడ పట్టి, ఆ పొడి ఎంత తూకం వుంటే దానికి రెట్టింపు దంచిన పాత బెల్లం కలిపి, ఉదయం, సాయంత్రం భోజనం తరువాత 10 గ్రా. సేవిచండి. ఎలేర్జి సమస్య తప్పక నివారించబడుతుంది.
 • ఆకుపత్రి అంటే బిర్యాని ఆకు దాన్ని తేజ్పత్తా అని కూడా అంటారు.ఈ ఆకు ఎండ బెట్టి, పొడి చేసి ఆ పొడితో సమానంగా ఆయుర్వేద షాప్ లో దొరికే అతిమధురం పొడి కలిపి నిలువ వుంచుకోవాలి రోజు ఉదయం పరగడపున రాత్రి నిద్రపోయే ముందు అర గ్లాస్ ఆవు పాలలో అర టీ స్పూన్ పొడి కలిపి త్రాగవలెను. దీని వలన మానసిక బలం కలగడమే కాకుండా ఎలేర్జి సమస్య తప్పక నివారించబడుతుంది.
 • నిమ్మరసం లో విటమిన్ C ఉంది. విటమిన్ C అలెర్జీ రూపుమాపుటకు అత్యంత అవసరమైన పదార్థం. రోజువారి 1 గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ పిండి, చక్కగా కలిపి, ఉదయం సేవించండి. దీని వలన అలెర్జీ నివారణ అవుతుంది.
 • గోడ నుండి గోడ తివాచీలు తొలగించండి, ముఖ్యంగా బెడ్ రూమ్ లో. పెంపుడు జంతువులు బెడ్ రూమ్ బయట ఉంచండి. ఇంటిలోపల గాలిలోని తేమను తగ్గించుకోండి. దుప్పట్లు మరియు దిండ్ల కు కవర్లు ఉపయోగించండి; తరచూ వేడి నీటిలో బెడ్ షీట్లు, దుప్పట్లు మరియు దిండ్ల కవర్లు ఉతికించండి. ఎయిర్ కండిషనింగ్ యూనిట్ లో ఒక అధిక సామర్థ్యం గల వడపోత (Filter) పరికరం పెట్టించండి.
 • 1 టీ స్పూను ముడి తేనె సేవించండి.
 • క్వెర్సెటిన్ (quercetin) రసాయనం Antihistamine, డస్టు అలెర్జీని నివారిస్తుంది. ఈ రసాయనం కలిగిన అరటిపండ్లు, బొప్పాయి, గ్రీన్ ఆపిల్, ఎర్రని ద్రాక్ష, నీరుల్లి, కర్బూజ, టొమేటొ, బ్రాకొలి వంటివి సేవించండి.
 • డస్టు అలెర్జీ వలన కలిగే తీవ్రమైన తుమ్ముల నివారణకు, పావు టీ స్పూను శుద్ధమైన నెయ్యిని చప్పరించండి. నెయ్యి శ్వాస నాళాలను వేడి చేస్తుంది. అంతే కాకుండా డస్టు అలెర్జీ వలన చర్మము మీద ఏర్పడిన దద్దుర్లు, వాపుల నివారణకు నేతిలో ముంచిన దూది తో సున్నితంగా రుద్దండి.
 • ఒక టీ స్పూను ఎండిన పుదీనా ఆకుల పొడిని, 3/4 నీటితో నిండిన గ్లాసులో వేసి 10 నిముషాలు నాననిచ్చి, వడబోసి ఆపై సేవించండి. అలెర్జీ తీవ్రంగా ఉంటే అర గ్లాసు అయ్యేవరకు మరగబెట్టి, చల్లార్చి, వడబోసి సేవించండి.

నిద్ర లేమి:

 • నిద్ర బాగా పట్టుటకు ఆయుర్వేద షాపులలో దొరికే అశ్వగంధ పొడితో సమానముగా తాటి బెల్లం కలిపి దంచి రోజువారి 2 పూటలా తింటూ తరువాత ఒక కప్పు పాలు త్రాగుతూ ఉంటె మెదడుకు శరీరానికి శక్తి కలిగి పనికి మాలిన ఆలోచనలు రాకుండా సుఖ నిద్ర కలుగుతుంది.
 • ఎర్రాముదం చెట్టు వేరు 10 గ్రా. దంచి పావు లిటరు నీటిలో వేసి సగం నీళ్ళ అయ్యేవరకు మరగబెట్టి, వడపోసి త్రాగుతూ వుంటే సుఖ నిద్ర పడుతుంది.
 • ఆముదము చెట్టు పూవులను నూరి కణతలకు పట్టు వేసి, తలపైన కూడా వేసి కట్టు కడుతూ వుంటే అతి మగతగా వుండి ఎక్కువగా నిద్ర వచ్చే సమస్య నివారణ అగును.
 • బూడిద గుమ్మడి కాయలోని గింజలు తైలము రోజువారి రాత్రి నిద్ర పోయేముందు 10 గ్రా తలకి పట్టించుకున్నను లేక లోనికి పుచుకున్న ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
 • 1కప్పు పాలలో చిన్న చిన్న ముక్కలుగా చేసిన 4 – 5 ఎండు ఖర్జూరాలు, చిన్న చిన్న ముక్కలు చేసిన 3 – 4 బాదం, చిన్న చిన్న ముక్కలుగా చేసిన 3 – 4 పచ్చి కొబ్బరి ముక్కలు, అర టీ స్పూను కుంకుమ పువ్వు, 1 – 2 టీ స్పూను నెయ్యి, చిటికెడు యాలకుల పొడి వేసి చక్కని మిశ్రమం అయ్యేలా కలపండి. ఆపై సన్నని మంటపై మరిగించి, చల్లార్చి 1 టేబుల్ స్పూను ముడి తేనె కలపండి. రోజువారి నిదురించే ముందు 2 టేబుల్ స్పూనులు సేవించండి. నిద్ర పట్టడమే కాక నిద్ర సంబంధమైన సమస్యలు నివారణ అవుతాయి.
 • 1/8 టీస్పూను సముద్రపు ఉప్పు, ¼ స్పూను ముడి తేనె 1 టేబుల్ స్పూను కొబ్బరి నూనె కావాలి. ఈ పానీయం రెండు విధాలుగా తీసుకోవచ్చును:
 1. తేనె, కొబ్బరి నూనెకు చేర్చండి. సముద్ర ఉప్పు వేసి మరొకసారి వాటిని బాగా కలియ పెట్టండి. ఈ మిశ్రమం 1 టేబుల్ స్పూను తిని తరువాత ఒక గ్లాసు నీరు త్రాగండి.
 2. ముందుగా తేనె తిని, అప్పుడు కొబ్బరి నూనెను త్రాగండి. గ్లాసు నీటి లో ఉప్పు వేసి కలియబెట్టి ఆ మిశ్రమం త్రాగండి.

అప్పటికీ మధ్య రాత్రి లో మేల్కువ వచ్చి నిద్ర పట్టనట్లయితే, మళ్ళీ ఈ పరిహారం పునరావృతం చేయండి, వెంటనే గాఢనిద్ర వస్తుంది.

ఇది మీ శరీరమునకు మరియు మనసు కు విశ్రాంతిని ఇస్తుంది. రక్తం లోని, రాత్రంతా మేల్కొని ఉంచే కార్టిసాల్ (cortisol) స్థాయిని తగ్గిస్తుంది.

 • ½ టీస్పూను గసగసాలు వేయించి పొడి కొట్టండి. ఒక కప్పు పాలలో, అర టీస్పూను గసగసాల పొడి, మరియు అర టీస్పూను పటిక బెల్లం కలపాలి. ఈ పానీయం రాత్రి నిదురపోయేముందు తాగితే చక్కని నిద్ర వస్తుంది.

రక్త విరోచనములు:

 • 3 గ్రా వేప చిగుర్లు, 3 గ్రా పటిక బెల్లం పొడి కలిపి 2 విరోచనములకు మధ్య ఒకసారి తినిపిస్తూ వుంటే ఒక్క పూట లోనే రక్త విరోచనములు కట్టుబడతాయి.
 • మర్రి ఊడల రసం, జీలకర్ర చూర్ణము ఆవు పెరుగులో కలిపి 2 పూటలా సేవించిన రక్త విరోచనములు నివారణ అవుతాయి.
 • 1టీ స్పూను మెంతులు, అరకప్పు పెరుగులో కలిపి రాత్రంతా నాననివ్వండి.మరనాటి ఉదయం పరగడుపున సేవించండి. శరీర తత్వమును బట్టి 3 నుంచి 7 రోజులు తీసుకొనవలసి ఉంటుంది. దీని వలన రక్త, జిగట విరోచనములు నివారణ అవుతాయి.

చెవిలో పురుగు

 • నేల మీద నిద్ర పోయేటప్పుడు చిమ్మెటల వంటి పురుగులు చెవులో దూరి బయటికి రాకుండా బాధిస్తాయి. అలాంటి సందర్భాలలో ఉప్పు, వేపాకు కలిపి దంచిన రసం నాలుగు చుక్కలు చెవిలో వేస్తే క్షణాల్లో ఆ పురుగు చనిపోయి చెవి బాధ నివారణ అవుతుంది.
 • గది లోని లైట్లన్నీఆపి, గదిని చీకటి చేసి, టార్చిలైటు వెలుగు చెవిలో పడేలా పట్టుకొనండి. ఆ వెలుగునకు పురుగు దిశ మార్చి చెవి బయటకు వస్తుంది. కంగారు పడకుండా అందుబాటులోకి రాగానే ఫోర్సెప్సుతో పురుగును పట్టుకొని బయటకు తీయండి. (స్వానుభవం)

కలరా

 • ఉప్పు, మిరియాలు, జిల్లేడు పూవు సమ భాగాలుగా కలిపి మెత్తగా నూరి బఠాని గింజ పరిమాణము గోళీలు చేసి, గంటకు ఒక గోళి, 5 – 6 గోళీలు వేసుకుంటే కలరా నివారణ అవుతుంది.
 • పావు లీటరు మంచి నీళ్ళలో ఆముదం వేసి తాగితే కలరా వెంటనే ఆగిపోతుంది.
 • ఒక ఔన్సు మిరియాల కషాయములో ఆవగింజంత గోరోజనమును కలిపి తీసుకుంటే కలరా నివారణ అవుతుంది.
 • జిల్లేడు పువ్వులను కోసిన గంటకు, నూరి 3 గోధుమ గింజల పరిమాణము మంచి నీళ్ళల్లో సేవించవలెను.
 • తరచుగా ఐసు క్యూబ్సు తినుచుండిన వాంతులు కట్టును.
 • నల్లమందు, ఇంగువ, మిరియాలు ఒక్కొక్కటి 3 గ్రా తీసుకొని, నూరి 20 ఉండలను చేసి రోగ తీవ్రతను బట్టి ప్రతి గంటకు 1 నుంచి 2 ఇవ్వవలెను.
 • మిరపకాయలను నిప్పులపై మాడ్చి అందులో నీళ్ళు పోసి కాచి వడపోసి త్రాగిస్తే దాహము తగ్గి కలరా వాంతులు తగ్గును.
 • నెయ్యిని అనుదినము తిను వారికి కలరా త్వరగా దరిచేరదు.
 • ముద్ద హారతి కర్పూరము ప్రతి దినము గోధుమ గింజంత తీసుకుంటే కలరా కలుగదు. కలరా సంభవించినదని అనుమానము కలిగినచో నీటిలో ముద్ద హారతి కర్పూరము కొంచెము కలిపి త్రాగించిన నీళ్ళ విరేచనములు తగ్గి పోవును.

మూలకర్త శ్రీ కార్తిక్ రాయల

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.