బొల్లిమచ్చల నివారణకు గృహవైద్యం

0
1098

చర్మం పైన కలిగే తెల్లని బొల్లి మచ్చల నివారణకు గృహవైద్యం

వైద్య పరంగా, చర్మంపై వచ్చే తెల్లని మచ్చలను బొల్లి అంటారు. ఈ మచ్చలు చేతులు, పాదాలు, అర చేతుల వెనుక, కాళ్లు, ముఖం, పెదవులు, కళ్ళ చుట్టూ, నోటి చుట్టూ మరియు వివిధ శరీర భాగాలు లో కనిపించవచ్చు.

ఈ చర్మ పరిస్థితి యొక్క ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియదు. నిపుణులు రోగనిరోధక వ్యవస్థ లోపము, మెలనోసైట్లు లేదా మెలనిన్ ఉత్పత్తి కణాల (శరీర ఛాయనిచ్చే కణాలు) పై జరిపే దాడి కారణం కావచ్చని భావిస్తున్నారు

ఈ సమస్యకు దోహదం చేసే ఇతర కారకాలుగా; జన్యు లక్షణ మార్పు, అధికంగా ఎండకు బహిర్గతమగుట, అధిక ఒత్తిడి, మరియు విటమిన్ బి 12 లోపం.

చర్మ ఉపరి తలం పై కలిగే ఫంగల్ ఇన్ఫెక్షన్ల వలన కూడా తామర వెర్సికోలర్ (ఒక దీర్ఘకాలిక రుగ్మత వెర్సికోలర్ తామర, బహుళ మచ్చల పాచెస్ చేత గుర్తించబడింది) తామర, సోరియాసిస్, లేదా ఇతర చర్మ పరిస్థితుల వలన కలగవచ్చు.

కారణం ఏదైనా, సమస్య ఇబ్బందిగానే ఉంటుంది మరియు ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి కారణం కావచ్చు. కానీ గుండె ధైర్యం కోల్పోనవసరం లేదు, ఈ సమస్య పరిష్కకారంగా కొన్ని సహజ గృహ నివారణలు ఉన్నాయి, వాటి ద్వారా ప్రయత్నించవచ్చు. అంతేకాక, కొన్ని సమయాల్లో ఇది తానంత తానుగా పరిష్కరించబడవచ్చు.

1. బావంచాలు (Psoralea corylifolia)
తెల్ల మచ్చలకు ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధంగా భావిస్తారు. ఈ మొక్క శక్తివంతమైన భాగాలు చర్మంపై తెల్లని మచ్చలను నివారించేందుకు సహాయం చేస్తాయి. అంతేకాక సోరియాసిస్ నివారణకు సహాయపడే antipsoriatic లక్షణాలు కలిగి ఉంది.

మూడురోజుల పాటు బావంచాల విత్తనాలు (బాకూచి అని కూడా పిలుస్తారు) అల్లం రసం లో నానబెట్టండి. ప్రతి రోజు అల్లం రసం తీసివేసి తాజా అల్లం రసం పోయండి. ఆపై, మీ చేతులు మధ్య విత్తనాలు రుద్ది విత్తనాలపైన పొట్టును తొలగించండి. తరువాత వాటిని ఎండ బెట్టి, మెత్తని పొడి తయారు చేయండి. 40 రోజులు రోజువారీ ఈ పొడి ఒక గ్రాము లేదా ఒక టీ స్పూనులో ఐదవ భాగం ఒక పాల గ్లాసులో కలిపి సేవించండి. సమయోచితంగా ఈ పొడిని మచ్చలపై దరఖాస్తు చేసుకొనవచ్చు.

మరొక ఎంపికగా బావంచాల నూనెను తెల్ల మచ్చలపై పూయండి, ఆపై ఉదయ సూర్యరశ్మిలో 15 నిమిషాల పాటు (ప్రారంభంలో తక్కువ వ్యవధి లో స్పందన అనుకూలంగా ఉందా లేదా తనిఖీ చేయండి) ఆ ప్రాంతాలను బహిర్గతం చేయండి. మరొక ఎంపికగా బ్లాక్ సీడ్ (నల్ల జీలకర్ర) చమురు మరియు బావంచాల నూనె తో కలిపి ఉపయోగించవచ్చు.

బావంచాల ఇతర ఉపయోగాలు
• జుట్టు నష్టం నివారణ,
• ఎముక కాల్సిఫికేషన్ మెరుగుపరచి బోలు ఎముకల వ్యాధి మరియు ఎముక పగుళ్లు వంటి ఎముక రుగ్మతలు చికిత్స చేస్తుంది.
• రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మరియు చర్మం యొక్క అనారోగ్య ప్రాంతాలపై మెలనిన్ (శరీర ఛాయ) ను ఉత్పత్తి చేసే కార్యకలాపాలు విస్తరిస్తుంది.
• ఇది సూక్ష్మ క్రిమి వ్యతిరేక గుణం కలిగి ఉంది, పరాన్నజీవి పురుగులను తొలగిస్తుంది, రక్తస్రావ నివారిణి, గుండె జబ్బు నివారణ, నొప్పుల నివారిణి.
• చెమటను పట్టిస్తుంది, ఆకలిని పెంచు మందు, మూత్రం ప్రవాహం పెంచుతుంది, మూత్రవిసర్జన ఆపుకొనలేని, మంచం చెమ్మగిల్లడం మరియు అనేక ఇతర శారీరక రుగ్మతలను నివారిస్తుంది.
వీటి విషయంలో డాక్టరును సంప్రదించడం అవసరమని గుర్తించాలి.

2. జింగో బిలోబా
పరిశోథనలు జింగో బిలోబా లోని ప్రతిక్షకారిని మరియు వ్యాధి నిరోధక లక్షణాలు బొల్లి చికిత్స లో సహాయపడుతుందని సూచిస్తున్నాయి. ఇది వ్యాధి యొక్క అభ్యున్నతి తగ్గించుటకు మరియు మచ్చలను శరీర ఛాయతో కలిసే రంగు ఉత్పత్తిని ప్రేరేపించుటలో సహాయపడుతుంది.

సాధారణ మోతాదు 40 నుండి 80 మి. గ్రా జింగో బిలోబా, రోజువారి మూడు సార్లు ఉంటుంది. ఈ సహజమైన ప్రముఖమైన జింగో బిలోబా ఆకు సారం ఒక హెల్త్ సప్లిమెంట్ గా పరిగణించబడుతోంది. జింగో బిలోబాను సజీవ శిలాజం (living fossil) అంటారు. ఇది ట్యాబ్లెట్ రూపంలో ఈజింగో ట్యాబ్లెట్ గా ఒక సహజమైన హెల్త్ సప్లిమెంట్ గా లభిస్తోంది. మీరు ఈ హెర్బ్ యొక్క సరైన మోతాదు నిర్ణయించే సహాయం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.

జింగో బిలేబా ఇతర ఉపయోగాలు
• అలెర్జీ తాపజనక ప్రతిస్పందనలు (allergic inflammatory responses), ఉబ్బసం, వృద్ధాప్యము మరియు చిత్తవైకల్యం నుండి ఉపశమనం కోసం అంతర్గతంగా (Oral) ఉపయోగించవచ్చు. ఇది జ్ఞాపకశక్తి, మానసిక చురుకుదనం మరియు ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు అనారోగ్య సిరలు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది.
• ఆకులు సారం సెరిబ్రో వాస్కులర్ కొరత (cerebro-vascular insufficiency), చిత్తవైకల్యం (dementia), జ్ఞాపక శక్తి నష్టం, మైకము, మూడ్ స్వింగ్స్ మరియు ఏకాగ్రత లోపం నివారించుటలో సానుకూల ప్రభావం చూపుతుంది.
• ఆకు సారం కూడా చెవిలో హోరు నివారించుటలో ప్రభావవంతంగా ఉంటుంది.
• ఆకులు క్రమం లేని హృదయ స్పందన స్థిరీకరణకు సహాయకారిగా ఉంటాయి; జింగో చెట్టు విత్తనాలు మూత్ర ఆపుకొనలేని మరియు మందపాటి శ్లేష్మ సంబంధం గల దగ్గును నివారించవచ్చు.
గమనిక: ఈ హెర్బ్ యొక్క సరైన మోతాదు నిర్ణయించే సహాయం కోసం మీ వైద్యుడిని సంప్రదించండం అవసరమని గుర్తించండి.

3. కొబ్బరి నూనె
కొబ్బరి నూనె చర్మమును ప్రశాంతపరచి మరియు దీర్ఘకాలిక శోథను (chronic inflammation) నివారిస్తుంది. ఇది చర్మము పైన ఏర్పడిన మచ్చలకు శరీర వర్ణము కలిగించే కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది అందుచేత ఇది బొల్లి చికిత్స లో సహాయపడుతుంది. అదనంగా దీనికి యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రయోజనాలు ఉన్నాయి.

కేవలం కొన్ని వారాల పాటు కనీసం రోజువారి రెండు మూడు సార్లు తెల్లని మచ్చలకు పచ్చి కొబ్బరి నూనె ఉపయోగించండి.

3. అల్లం
చైనీస్ మూలికా వైద్యం ప్రకారం, అల్లం బొల్లి కోసం ఒక అద్భుతమైన సహజ ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది మరియు మెలనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

ప్రభావిత ప్రాంతంలో దంచి ముద్ద చేసిన తాజా అల్లం కట్టి, అల్లం ముద్ద ఎండి పోయే వరకు ఉంచండి. కొన్ని వారాల పాటు రోజువారీ ఒకటి లేదా రెండుసార్లు లేదా మీరు అభివృద్ధి చూసేవరకు కొనసాగించండి.
ప్రత్యామ్నాయంగా ఒక పెద్ద అల్లం నుండి రసం తీసి దానికి తాజా పుదీనా ఆకుల రసం తగినంత కలపండి. ఈ మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు రోజువారీ ఒకటి లేదా రెండుసార్లు లేదా మీరు అభివృద్ధి చూసేవరకు సేవించండి.

5. రాగి
రాగి మెలనిన్ ఉత్పత్తిలో సహాయం చేస్తుందని నమ్ముతారు. టైరోసిన్ నుండి మెలనిన్ వర్ణద్రవ్యం తయారు చేసే ఎంజైమ్ టైరోసినాసి కు రాగి అవసరం అని నమ్ముతారు.

ఒక రాగి కుండ లేదా ఒక రాగి పాత్రలో తాగునీటిని నింపి, గది ఉష్ణోగ్రత వద్ద రాత్రంతా ఉండనివ్వండి. (ఈ నీటిని రిఫ్రిజిరేటర్ లో ఉంచవద్దు అలా చేయడం వలన ఈ నీటికి వచ్చిన లక్షణాలు నాశనం మయి తక్కువ ప్రభావవంతంగా మారవచ్చు). రాత్రంతా ఇలాగున ఉంచిన నీరు ఉదయయ్యే సరికి, ఆనీటిలో మెలనిన్ ఉత్పత్తిలో సహాయపడే రాగి అయాన్లుతో నింపబడి ఉంటుంది.
రోజువారీ ఈ నీటిని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తో కొన్ని వారాల పాటు లేదా మీరు అభివృద్ధి చూసేవరకు సేవించండి.

6. ఎర్ర బంకమట్టి (Red Clay)
ఎర్ర బంకమట్టి, అధిక రాగి పదార్ధము కలిగి ఉంది. ఇది, చర్మ వర్ణద్రవ్యం పునరుద్ధరించడానికి సహాయపడుతుంది తెలుపు మచ్చలను తొలగించ గలదు.

ఎర్ర మట్టి మరియు అల్లం రసం సమాన మొత్తంలో కలపండి. ప్రభావిత ప్రాంతాల్లో ఈ ముద్దను పూయండి, పూర్తిగా ఎండే వరకు వదిలి ఆపై కడగండి.
రోజువారీ కొన్ని నెలల పాటు పునరావృతం చెయ్యండి.

7. ముల్లంగి విత్తనాలు
దంచి పొడి చేసిన ముల్లంగి విత్తనాలు మరియు వినెగార్ తో కలిపిన పేస్ట్ బొల్లి లేదా leukoderma చర్మానికి ప్రముఖ ఆయుర్వేద నివారణ మార్గంగా చెప్పవచ్చు.

25 గ్రాముల ముల్లంగి విత్తనాలను ముతక పొడిగా దంచి, రెండు టీ స్పూనుల ఆపిల్ సైడర్ వెనెగర్ తో కలిపి పేస్ట్ గా తయారు చేయండి. 30 నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతంలో ఈ పేస్ట్ ను పూయండి, ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి. రోజువారీ కొన్ని నెలల పాటు పునరావృతం చెయ్యండి.

8. ఆపిల్ సైడర్ వినెగర్
ఆపిల్ సైడర్ వినెగర్ మైక్రోబియల్ లక్షణాలు శిలీంధ్రాల వలన చర్మంపై ఏర్పడే తెల్లని మచ్చలను నాశనం చేస్తాయి. అంతేకాక తక్కువైన ఉదర ఆమ్ల సంబంధమైన బొల్లి నివారణకు సహాయం చేస్తుందని నమ్ముతారు.

ఆపిల్ సైడర్ వినెగర్ మరియు మంచినీటిని సమాన భాగాలుగా కలిపి. రోజువారి రెండుసార్లు ప్రభావిత చర్మమును కడగండి. ఈ మిశ్రమమును ఒక నెలపాటు రోజువారీ పునరావృతం చేయండి. తెలుపు మచ్చలు రంగు మార్పు ప్రారంభమౌతుంది మరియు త్వరలో సమస్య నివారణ అవుతుంది.
అలాగే, రోజువారీ భోజనం ముందు ఒక టీ స్పూను ఆపిల్ సైడర్ వినెగర్ గ్లాసు నీటిలో కలిపి సేవించండి.

9. పసుపు
పసుపు, చర్మంపై తెలుపు మచ్చలను తొలగించుకోవటానికి ఉపయోగించే మరొక పదార్ధంగా ఉంది. ముఖ్యంగా పసుపు మరియు ఆవనూనెల మిశ్రమం ఈ విషయంలో ఉపయోగకరమైనదిగా భావిస్తారు.
ఐదు టీస్పూన్ల పసుపు పొడితో, 250 మిల్లిలీటర్లు లేదా ఒక కప్పు ఆవనూనె తో కలపండి. ప్రభావిత చర్మ ప్రాంతాలలో ఈ మిశ్రమం పూయండి. అత్యంత ప్రభావవంతమైన ఫలితం కోసం ఒక సంవత్సరం పాటు రోజువారీ రెండుసార్లు ఈ పరిహారం అనుసరించండి.

మరొక ఎంపికగా పసుపు మరియు వేప ఆకులు నూరి పేస్ట్ చేసి, ప్రభావిత ప్రాంతం మీద పూయండి. సమస్య సంక్రమణ (infection) వలన కలిగి ఉంటే ఈ మిశ్రమం యొక్క క్రిమినాశక లక్షణం దానిని నివారిస్తుంది.

10. వేప
వేప, చర్మ సమస్యల చికిత్స కోసం అద్భుతమైన ఔషదం. ఇది చర్మము రంగును పునరుద్ధరించడంలో సహాయ పడుతుందని నమ్ముతారు. అంతర్గతంగా తీసుకున్న సమయంలో, అది రక్తం పరిశుద్ధ పరచే మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించే పనిచేస్తుంది.

కొన్ని వేప ఆకులు నూరి, తగినంత మజ్జిగ కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్ ను తెల్ల మచ్చల మీద పూసి మరియు అది పూర్తిగా ఎండే వరకు వదిలి, ఆపై కడగండి. ఈ పరిష్కారం రోజువారీ కొన్ని వారాల పాటు అనుసరించండి.

మరొక ఎంపికగా కొన్ని చుక్కల వేప నూనె ఒక టీ స్పూను కొబ్బరి నూనె లేదా మీకు అనువైన ఇతర నూనెతో కలిపి వేప నూనె గాఢతను తగ్గించండి. తర్వాత ప్రభావిత చర్మం మీద రోజువారీ పూయండి.
రోజువారీ కొన్ని నెలల పాటు వేప రసం కూడా త్రాగవచ్చు లేదా సప్లిమెంట్ రూపంలో తీసుకొనవచ్చు. మరొక ఎంపికగా భోజనం ముందు, నాలుగు వేప ఆకులు రోజుకు మూడు సార్లు తినవచ్చు.

ఈ నివారణలు పాటు, బొల్లితో బాధపడే వారు ఆహారంలో శ్రద్ద చూపాలి. ఉదాహరణకు, నేరేడు వంటి బెర్రి జాతి ఫలములు భుజింప రాదు. ఈ పండ్లు హైడ్రోక్వినోన్ (hydroquinone) కలిగి ఒక సహజ శరీర ఛాయను తొలగించే ఏజెంట్లు గా పనిచేస్తాయి.

బొల్లికి తరచూ విటమిన్ బి 12 లోప సంబంధం ఉండటం వలన, క్యాబేజీ, పాలకూర, ఎండిన బీన్స్, ఎండిన అత్తి (అంజూర్) పండ్లను, అక్రోట్లను (walnuts), చిక్పీస్ వంటి విటమిన్ బి 12 సమృద్ధిగా ఉన్న శాఖాహారలకు సిఫార్సు ఉంది. ఇతర ఆహార పదార్థాలుగా, ఫోలిక్ యాసిడ్, మరియు జింక్ చేర్చవచ్చు. అయితే, మాంసాహార ఆహారాలు, ముఖ్యంగా ఎరుపు మాంసం మరియు సముద్ర మత్స్యాలు నివారించాలి.


@ అనువాదం Subbarao Kasturi

@ మూలం http://www.top10homeremedies.com/

 

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.