చుండ్రు

0
455

చుండ్రు కు గృహ నివారణలు చుండ్రు ముఖ్యంగా శీతాకాలంలో కలిగే, ఒక సాధారణ సమస్య. ఎక్కువమంది శీతాకాలంలో వేడి నీటితో తల స్నానం చేయడం వలన, తరచుగా చర్మం పొడిబారి మరియు పొరలుగా మారిపోతుంది. ఇక్కడ జిడ్డు, అలాగే పొడి చుండ్రు వదిలించుకోవడానికి కొన్ని గృహ నివారణలు ఉన్నాయి ప్రయత్నించండి. రెండు టేబులుస్పూనుల మెంతులు రాత్రంతా నీటిలో నానపెట్టాలి. ఉదయం నీటిని వేరుపరచి మెత్తగా రుబ్బాలి.

నెత్తిమీద చర్మంపై (Scalp) రాసి అరగంట వేచి ఉండాలి. తరువాత కుంకుడి పులుసుతో (ritha) తలంటండి (జుట్టు శుభ్రం చేయడం). తర్వాత మెంతులు నానపెట్టిన నీరు జుట్టు టానిక్ గా ఉపయోగించండి. మొదటి రెండు వారాలు, వారానికి రెండుసార్లు మరియు మరొక రెండు వారాల పాటు వారానికి ఒకసారి ఈ నియమావళి అనుసరించండి. ఒక ఆరోగ్యకరమైన జుట్టు సంరక్షణ క్రమణికను అనుసరించడం ద్వారా చుండ్రును నియంత్రింత వచ్చు. మీరు కొన్ని సాధారణ సహజ గృహ నివారణలు ప్రయత్నించండి. సహజ నివారణలు ఫలితాలను చూపడానికి సమయం పడుతుంది కానీ అవి సమర్థవంతంగా పూర్తిగా సమస్యకు చికిత్స చేస్తాయి.

1. వేప (Indian Lilac) వేప పేరొందిన యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగిన ఔషదం. వేప సమర్ధవంతంగా, చుండ్రు అలాగే నెత్తిమీద మోటిమలు, తల దురద, మరియు జుట్టు రాలడం వంటి అనేక ఇతర జుట్టు సమస్యలకు చికిత్స అందిస్తుంది. • చేతికి పట్టినన్ని వేప ఆకులు నాలుగు కప్పుల నీటిలో మరిగించాలి. • చల్లపరచి వడబోయాలి. • ఈ కషాయంతో జుట్టును వారానికి రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేయాలి.

2. కొబ్బరి నూనె కొబ్బరి నూనె లోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు తొలగించడానికి సహాయపడుతుంది. ఇది పొడి చర్మానికి తేమ నిస్తుంది మరియు తల దురద నుండి ఉపశమనం అందిస్తుంది. • కొంచం కొబ్బరి నూనె తీసుకొని దానిలో సగం మొత్తం నిమ్మ రసం కలపాలి. • మీ జుట్టును కొన్ని నిమిషాలపాటు ఈ మిశ్రమమును రుద్ది మర్దన (massage) చేయాలి. • కనీసం 20 నిమిషాల తర్వాత మీ జుట్టును కుంకుడు రసంతో శుభ్రం చెయ్యండి.• ఈ పద్దతి వారానికి రెండు మూడు సార్లు అనుసరించండి.

3. ఆపిల్ సైడర్ వినెగార్ ఆపిల్ సైడర్ వినెగార్ ప్రభావవంతంగా చుండ్రును తొలగించగలదు. ఇది pH సంతులనం పునరుద్ధరించి తద్వారా ఈస్ట్ పెరుగుదలను నిరోధిస్తుంది, ఇది జుట్టుకు ఒక సహజ క్లారిఫైర్ గా పనిచేస్తుంది మరియు జుట్టు గ్రీవముల (hair follicles) రంధ్రాలకు అడ్డుపడే పదార్ధములను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. • ఆపిల్ సైడర్ వినెగార్ రెండు టేబులు స్పూనులు తీసుకోండి. • దానికి సమానమైన నీటిని మరియు 15-20 డ్రాప్సు టీ ట్రీ ఆయిల్ కలపాలి. • మీ చర్మం (scalp) మీద రుద్ది, మసాజ్ చేసి కొన్ని నిమిషాల తర్వాత మీ జుట్టును శుభ్రం చేయండి. • ఈ సహజ చికిత్స వారంలో రెండు లేదా మూడు సార్లు అనుసరించండి.

4. వంట సోడా (Baking Soda) ఒక మృదువైన, పోరలను తొలగించే ఔషదం. వంట సోడా నిర్జీవ చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది మరియు అదనపు చమురును గ్రహిస్తుంది. ఇది తల మీది చర్మ (scalp) pH స్థాయి సంతులనం చేయడంలో సహాయపడి, చుండ్రు కలిగించే శిలీంధ్రాల (fungi) వృద్ధిని అరికడుతుంది. • మీ జుట్టు తడి చేసి మీ చర్మం పై సోడా scalp మీద వంట సోడా రుద్దండి. • రెండు నిమిషాల తరువాత, వెచ్చని నీటితో మీ జుట్టును బాగా శుభ్రం చేయడి. • కొన్ని వారాల పాటు, వారానికి ఒకసారి లేదా రెండుసార్లు పునరావృతం చేయండి. గమనిక: ఈ చికిత్స తర్వాత మీ జుట్టు శుభ్రపరచుటకు షాంపూ వాడవద్దు. ఇది చికిత్స లలో ఉండడంచేత ఇక్కడ ఇవ్వబడింది, దీనికి తేమను హరించే గుణం ఉండడం వలన, అత్యవసరం అయితే తప్ప ఈ చికిత్స వాడవద్దు (వ్యక్తిగత సమాచారం).

5. తెలుపు వినెగార్ తెలుపు వెనిగర్, చుండ్రు అరికట్టే ఉత్తమ గృహ చికిత్సలలో ఒకటి. తెలుపు వినెగార్ లోని ఎసిటిక్ ఆమ్లం మీ జుట్టుకు పట్టిన శిలీంధ్రాలు అభివృద్ధిని నిరోధిస్తుంది మరియు తల దురదకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. • రెండు కప్పుల నీటికి అర కప్పు వెనిగర్ జోడించండి. మీ జుట్టును సున్నితమైన షాంపూతో శుభ్ర పరచి తర్వాత ఈ మిశ్రమం తో మీ జుట్టును బాగా రుద్దండి. • మరొక ఎంపిక, రెండు భాగాలు తెలుపు వినెగార్, ఒక భాగం ఆలివ్ నూనె మరియు మూడు భాగాలు నీటి మిశ్రమం తో మీ జుట్టు రుద్దండి. 10 నిమిషాల తరువాత, ఒక తేలికపాటి షాంపూ ఉపయోగించి మీ జుట్టును శుభ్రపరచండి. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఈ నివారణలు అనుసరించండి.

6. ఆలివ్ నూనె అదనపు పచ్చి ఆలివ్ నూనె (extra-virgin olive oil), ఒక ప్రభావవంతమైన సహజ తేమనీయగల ఔషధం. దీని సక్రమ వినియోగం తో పొడి బారిన తల చర్మమును (Scalp) నయం చేయవచ్చు. అదనపు పచ్చి ఆలివ్ నూనెను గోరు వెచ్చ పరచండి. మీ చర్మం పై (Scalp) దీనితో మసాజ్ చేసి ఆపై ఒక వెచ్చని టవల్ మీ జుట్టుకు చుట్టబెట్టండి. అప్పుడు కనీసం 45 నిమిషాలు వేచి లేదా రాత్రంతా ఉంచి, మీ జుట్టును షాంపూ చేసి పిదప కండిషనర్ వాడండి. ఒక వారం లో 2-3 సార్లు ఈ పరిహారం పునరావృతం చేయండి.


@ Subbarao kasturi

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.