ఇల్లాలి ఇక్కట్లు

0
408

ఇల్లాలి ఇక్కట్లు
వర్షాకాలం ముచ్చట్లు
ఉతకని బట్టలు
తడిచిన తలలు
విడిచిన బట్టలు
మానలేని ఆఫీసులు
చేసే జలుబు
తగ్గని దగ్గు
వచ్చే జ్వరాలు
వాడే మందులు
పిల్లల అలకలు
రోజూ స్కూ ళ్ళు
తడిచే పుస్తకాలు
ఆగని హోమ్ వర్కులు
ఆడితే తిట్టే అమ్మ
రానంటే వినని ప్రెండు ..
ఒకటా రెండా ఎన్నెన్ని తిప్పలో…

అబ్బ అన్నీ ఇబ్బందులే …

వానా వానా వల్లప్పా అంటూ తడిచేస్తాం సరే
తర్వాత ఎన్ని ఇబ్బందులో…
తడిచినా కాస్త జాగ్రత్త తీసుకుంటే
ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

కాచిన నీటిని తాగటం
రోజూ తీసుకునే పాలలో కాస్త పసుపు,లేదా మిరియాల పొడి కలిపి తాగితే దగ్గు రాదు..

తడిచిన తలను డ్రయ్యర్లతో కాక కాస్త సాంబ్రాణి వేసుకుంటే జుట్టు రాలదు…జలుబు చేయదు..

కాకరకాయ,నిమ్మకాయ,పసుపు మెంతికూర,తినటం వాల్ల బాక్టిరియా వాలన కలిగే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు.

టి,కాఫీ లు ఎక్కువగా తీసుకోకుండా ఉండటం ఉత్తమం.

తగినంతగా వండుకుని వేడివేడిగా తినటం మంచిది.
ఈ కాలంలో కారం కారంగా తినటానికి ఇష్టపడటం సహజం
ఇవన్నీ ఎక్కువ ఆయిల్ లో వేయించిన పదార్దాలే ఉంటాయి.
అలాంటివాటిని తగ్గించుకుని తినటం మంచిది.
ఇంట్లో దొరికే చిన్న చిన్న పదార్ధాలతోనే ఈ కాలంలో కలిగే ఇబ్బందులను తొలగించుకోవచ్చు

ఇంట్లో రోజు అగరవత్తులు వెలిగించటం వల్ల లేదా..సాంబ్రాణి వేయటం వల్ల ..లేదా బిర్యానీ ఆకులు రెండు కాల్చటం వల్ల..ఇల్లు మంచి సువాసనతో పాటు దోమలు ఈగలు కూడా రాకుండా ఉంటాయి.


@తులసి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.