పిల్లలు – చదువులు

0
828

పిల్లలు – చదువులు


ఈ కాలం చదువు మారిపోయాయి..ఒకప్పుడు చదువుకుంటే జ్ఞానం వస్తుంది..
నలుగురితో కలసి వుంటే సర్దుకుపోవటం తెలుస్తుంది..
ఒకరికి తో ఒకరు స్నేహం గా వుంటారు..
ఇచ్చి పుచ్చుకోవటం తెలుస్తుంది అని అనేవారు..

కానీ నేటి కాలం లో అంతా మారిపోయింది..
చదువు అంటే కేవలం చదువే..ఆటలు పాటలు ఇవేమీ లేవు..

పొద్దున్న లేచిన దగ్గరనుండీ హడావిడి,స్కూలు కి వెళ్తారు పొద్దున్న 8 కల్లా..మళ్ళి 4 కి ఇంటికి వస్తారు.. .
వచ్చిన దగ్గరనుండీ హోంవర్కులు, తర్వత ట్యూషనులు, కాస్త తీరిక ఉంటే సంగీతమో డాన్సో..
ఒకదాని తరువాత ఒకటి ఖాళీ లేకుండా ఏదో ఒకటి..

వారితో కాసేపు మాట్లాడే సమయం కానీ, కాసేపు ఆడూకోమనటం కానీ వుండవు..
ఒకవేళ ఆడినా కంప్యూటర్ గేంసో, వీడియో గేంసో ఆడే వాళ్ళే కానీ తోటి పిల్లలతో ఆడే పిల్లలే కనిపించటం లేదు..

అమ్మో మమ్మి తిడతారు ఆడితే అనే పిల్లలూ వున్నారు….

సహజం గా పెరగాల్సిన వారి బాల్యాన్ని.. సహజం గా ఎదగాల్సిన వారి అలోచనా శక్తి నీ బలవంతం గా వద్దు ఇలానే వుండాలీ..  అనే హద్దు గీస్తున్నాం….

ఈ రోజు మనం నేర్పిన పాఠాలే రేపు వాళ్ళ తరువాతి తరానికీ వాళ్ళు నేర్పుతారు..

ఇంతకుముందు తల్లిదండులని ఒక వయసు దాటాక వారి బాగోగులను చూస్తూ వారిని జగ్రత్తగా చూసుకునేవారు..

కానీ ఇప్పుడు ఓల్డేజి హోములనీ కొంత డబ్బు కట్టి వదిలేస్తున్నారు..
ఎందుకు అని ఒకసారి ప్రశ్నించుకోండి?

సమధానం మనలోనే వుంది..వారికి తల్లి తండ్రి అంటే ఎమిటో, తోబుట్టువులంటే ఏమిటో, వారితో అనుబంధం అంటే ఏమిటో తెలిస్తేకద..

వాళ్ళు అలా తయారుకావటానికి కారణం ఎవరు?

చదువుల పేరుతో ఇంటికి దూరంగా కొందరూ, ఇంట్లోనే వున్న ఒంటరిగా మిగిలిన వారు..

ఒక ఇంటి బిడ్డలైనా ఇద్దరూ ఒకరితో ఒకరు కలిసుండే సమయమేది?

పిల్లలు బాగా చదవాలని కోరుకోవటం తప్పు కాదు..

కానీ వారి స్వేచ్చనీ, స్వాతంత్ర్యాన్నీ, వారి బాల్యాన్ని నిర్దక్షిణ్యం గా నలిపేసి వారిని మర మనుషులుగా మనమే మారుస్తున్నాం…

ఇలాంటి వాతావరణం లో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక, పెళ్ళయ్యకా కూడా ఎవరితోనూ ఇమడలేరు..
ఆఖరుకి భార్యాతో అయిన భర్త తో అయినా కూడా..

పిల్లలు చదువుకోవాలీ మంచి నడవడికతో వుండాలీ అని ఆశించటం తప్పు కాదు..
100 కి 100 రావలసిన అవసరం లేదు…
వారికి చదువు వల్ల విజ్ఞానం పెరగాలి కానీ మరబొమ్మల్లా కాకూడదు..

ఆటలూ, పాటలూ, చిలిపి పనులూ, అలకలూ కోపాలూ, బుజ్జగించటాలూ, ప్రేమలూ, అసూయ,
లాలనా, పాలనా, అన్నీ అనుభవించనీయండి..
స్వతహాగా నేర్చుకోవటానికి సహకరించండి..

తప్పు చెస్తే తప్పు అని చెప్పండి..తప్పు దిద్దుకోవటానికి వారికి సహకరించండి….బాగ చెస్తే మెచ్చుకోండి..
మీ మెచ్చుకోలు వాళ్ళ అలొచనా శక్తిని పెంచుతుంది..

ఏది తప్పు ఏది ఒప్పు అన్నది స్వతహాగా తెలుసుకోవటానికి వారికి సలహా ఇవ్వండి..
వేరే పిల్లలతో సరి పోల్చకండి..ఒక్కో పిల్లల్లో ఒక్కో విషయం వుంటుంది..
అందరూ ఒక్కలా వుండరు..వేరొకరిలా వుండాలని ఆశించకండి…

బలవంతంగా వారి బాల్యాన్ని వారి నుండి దూరం చెయకండి..
భావోద్వేగాలు కలిగిన మనుషులుగా పుట్టినందుకు మనం మన పిల్లలకు ఇవ్వగలిగిన గొప్ప వరం..

తరాలు మారినా అంతరాత్మలలో వుండే మనిషిని చావకుండా నిలబెట్టగల గొప్ప అద్రుష్టవంతులం..మనం.. మానవులం..


@తులసి..

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.