ఇప్పుడంతా ఆప్ డేట్ వెర్షన్స్
అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి
ఎంత లేటెస్ట్ ఉంటే అంత క్రేజ్
కాలేనివి కాలక్రమంలో కలసిపోతాయి
మన బాల్యం కూడా అంతే..
అలా అప్డేట్ కాలేక మనతోనే మిగిలిపోయింది
ఇలా అప్పుడప్పుడూ ఎక్కడో కొందరు..
హృదయాల్లో నిలిచిన భావాలకు రూపాలు ఇస్తుంటారు
అప్పుడనిపిస్తుంది …
ఎంత బావుండేది మన బాల్యం అని..
ఎండకు ఎండినా…వానకు తడిచినా చలికి వొణికినా..
చలిమంటలేసినా…అదో ఆనందంఅదో స్వేచ్ఛ..
సెలవులిచ్చినా ..లేకున్నా …
ఎప్పుడూ ఇంటిపట్టున మాత్రం ఉండలేదు..
అలా అని ఎండదెబ్బ తాకాలేదు..
అదో ప్రపంచం అంతే…
ఆ ప్రపంచం తెలిసినవారికే అర్ధమవుతుంది ఆ పసివాసన
ఇప్పుడూ బాల్యం బాల్యమే..కానీ..
పుట్టిన పిల్లలకి చందమామ రావే పోయి
చేతిలో ఐపాడ్..అందులో యూ ట్యూబ్..
జానీ జానీ ఎస్ పాపా..అంటూ నోరు తెరిపించి ముద్ద పెట్టడం..
బాబా బ్లాక్ షీప్ తో మరో ముద్ద..
రైన్ రైన్ గో ఏ వే..తో దిష్టి తీయటం…
పనిలో ఉంటే సరే సరి…
అలా బయటికి వెళ్లినా కార్లు,బైకులు..
ఇంక నడవటం ఎక్కడ..బయట తిరగటం ఎక్కడ
ఎండకి టాన్ (tan)..వర్షానికి జలుబు..చలికి ఎలర్జీ..
పుస్తకాలు..అవి పోతే ఇండోర్ గేమ్స్…ఇంకా కంప్యూటర్..మొబైల్ లో ఆటలు..
అన్నీ… లేటెస్ట్ అప్డేటెడ్ …
@ తులసి