పనీర్ వెజ్ టిక్కా

0
459

వచ్చేది వానాకాలం.. వేడివేడిగా..కాస్త కారంగా తినటం పిల్లలకే కాదు అందరికీ ఇష్టం..అందుకే ఓ చిన్న ప్రయత్నం..పనీర్ టిక్కా మసాలా…వినటానికి భారీగా ఉంది కానీ తాయారు చేయటం చాలా సులభం..ఇంట్లోనే..అదీ ఓవెన్ లేకుండా నాన్ స్టిక్ పాన్ మీదనే..కావాలసిందల్లా కాస్త ఓపిక మరికొంత తీరిక అంతే…

పనీర్ వెజ్ టిక్కా

పనీర్ వెజ్ టిక్కా ఆన్ తవా.. ఓవెన్ లేకుండా ఇంట్లో తవా మీద చేయటం చాలా సులభం. కావలసిన పదార్ధాలు…

250 గ్రామ్స్ పనీర్

1 పెద్ద సిమ్లా మిర్చి

1 పెద్ద ఉల్లిపాయ

అన్నింటినీ కాస్త పెద్దగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

 

 

 

మేరినేట్ కోసం.. 200 గ్రామ్స్ పెరుగు..కాస్త చిక్కగా కావాలి..అందుకు ఒక పల్చటిక్లాత్ లో పెరుగు వేసి నీరు కారిపోయేలా ఉంచాలి..

అందులో

1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్

1 టేబుల్ స్పూన్ వాము

1లేదా సరిపడినంత కారం

1/2స్పూన్ పసుపు

1 టేబుల్ స్పూన్ జీలకర్ర

1 టేబుల్ స్పూన్ కొత్తిమీర

1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా

1 టేబుల్ స్పూన్ ఆమ్ చూర్ పౌడర్ ..ఇది షాప్ లో దొరుకుతుంది

2 టేబుల్ స్పూన్ శనగపిండి

1 టేబుల్ స్పూన్ చాట్ మసాల

1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ (మిరియాల) పౌడర్ నచ్చితే..

సగం నిమ్మకాయ జ్యూస్

1లేదా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి లేదా ఆయిల్ కొద్దిగా నల్ల ఉప్పు.

తయారీ విధానం….

పనీర్..సిమ్లా మిర్చి,ఉల్లిపాయని స్క్వేర్ షేప్లో కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ లో పెరుగును వేసి కాస్త తిప్పితే స్మూత్ పేస్ట్ లా అవుతుంది..దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్,మరియు పైన చెప్పినవన్నీ వేసి బాగా కలపాలి…ఆయిల్ లేదా నెయ్యి కూడా…ఇష్టమయితే.

ఈ మిశ్రమంలో పనీర్,ఉల్లి,సిమ్లా మిర్చి ముక్కలు వేసి బాగా కలియబెట్టి వాటిని 2 గంటలు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. తరువాత బయటకు తీసి కూలింగ్ తగ్గాక నాన్ స్టిక్ పాన్ మీద చక్కగా పరిచి చక్కగా కాలనివ్వాలి.. తర్వాత ఒక స్టిక్ తీసుకుని వరుసగా మూడింటిని గుచ్చి చక్కగా ప్లేట్ లో ఎరేంజ్ చేయటమే… చక్కటి పనీర్ టిక్కా రెడీ…


ప్రియదర్శిని కృష్ణ

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.