స్ట్రెస్‌

0
423

చాలామందితో పోటీపడి లైఫ్‌లో విజయం సాధించాలి” అన్నది దాదాపు ప్రతీ ఒక్కళ్లూ నమ్మే కాన్సెప్ట్..

విజయం సాధించే వాళ్లెంత మంది ఉంటారో తెలీదు గానీ పోటీ పడలేక, పక్కన పరిగెత్తే వాళ్ల paceని చూసుకుంటూ ఆ వేగంతో పరిగెత్తలేకా, నా వల్లేం కాదని దిగులుపడి చతికిలపడిపోయే వాళ్లెంతమందో.. ఈ పోటీ వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలతోనో, హార్ట్ అటాక్‌లతోనో చనిపోయే వాళ్లు కూడా!

జీవితంలో గెలవాలంటే పోటీ పడడం ఒక్కటే మార్గం కాదు. నలుగురు వెళ్లే దారిలో వెళ్లినప్పుడే “పోటీ” అన్న పదం పుట్టుకొస్తుంది. మనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకుంటే.. ఓ unique path క్రియేట్ చేసుకుంటే అస్సలు పోటీ అన్న ప్రసక్తే లేదు. బట్ చాలామంది స్కేలబులిటీ ఎంసెట్ ర్యాంకుల మధ్యనో, సాఫ్ట్‌వేర్ జాబ్స్, పేస్కేల్స్ మధ్యనో కుంచించుకుపోతోంది. అంతకన్నా ఎదగలేరు, అంతకన్నా భిన్నంగా ఆలోచించలేరు, భిన్నంగా ఆలోచిస్తే పేరెంట్స్ ఒప్పుకోరు, చూసే సొసైటీ ఒప్పుకోదు.

కుదిరితే USలో, లేదంటే ఇండియాలో abcxyz అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో… _________ జాబ్ చేస్తూ చేతి నిండా పుష్కలంగా డబ్బులు ఉంటే, పర్సు నిండా క్రెడిట్ కార్డులు ఉంటే చాలు.. ఈ జీవితానికి! ఇదీ సొసైటీ మన నుండి కోరుకునే అతి గొప్ప ఎదుగుదల.
ఆ abcxyxలో ____________ పొజిషన్ కోసం కష్టపడాల్సి వస్తోంది.. రేపు ఇంకో కంపెనీలో 10 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తారంటే దాని కోసమూ కొత్తవి నేర్చుకుని పోటీపడి పొజిషన్ దక్కించుకోవలసి వస్తోంది.

————————————————————————

ఈరోజు జీవితాల్ని కబళిస్తున్న అతి పెద్ద సమస్య stress. స్ట్రెస్‌కి కారణం పోటీ.. ప్రతీ క్షణం ఎవరితోనో కంపేర్ చేసుకుని మనం తక్కువ ఉన్నామని ఫీలవ్వాలి.. ఇలా ఉంటే లైఫ్ ఎలానా అని భయపడాలి… బాధపడాలి… కాసేపు ప్రశాంతంగా కూర్చున్నది కాస్తా ఆదరాబాదరా లేచి పరిగెత్తాలి.

వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే… నా లైఫ్‌లో ఇంతవరకూ దేన్నీ, ఎవరినీ పోటీగా తీసుకోలేదు.. దేనితోనూ పోటీపడలేదు. ఎక్కడికో ఎదిగిపోవాలని ప్రయత్నించలేదు. జస్ట్ మనం చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్లడమే. ఎలాంటి కాలిక్యులేషన్లు, కంపారిజన్లు అవసరం లేదు. చాలావరకూ మన మెంటల్ రిసోర్సెస్ ఇలాంటి కంపారిజన్లనే హరించుకుపోతున్నాయి… పోనీయండి.. జనాలందర్నీ ఎదగనీయండి.. మనమొక్కళ్లమేం ఎదిగిపోవాలనుకోవడం స్వార్థమే కదా.. అలాగే ఎవర్నో తలుచుకుని అనవసరంగా పోటీ పడి.. ఊపిరి కూడా పీల్చుకోకుండా గుండెలు ఆగిపోయేలా పరిగెత్తడం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోండి.

దురదృష్టవశాత్తు పెద్దలు, పేరెంట్స్ సొసైటీలో పోటీపడి నెగ్గమని కోడిపందేల్లో కోళ్లను రంగంలోకి దింపినట్లు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. చాలామంది తలలు తెగిపోతున్నాయి.. రక్తం కారుతోంది… అయినా అదిమిపెట్టుకుని పోటీ పడుతున్నారు. ఈ నరకం జీవితంలో అవసరమా?

ప్రశాంతంగా మీకంటూ ఓ స్వంత మార్గాన్ని సృష్టించుకుని… ఎవరేం అనుకున్నా, ఎవరు గొప్పగా చూసినా చూడకపోయినా.. మీకు నచ్చిన దారిలో మీరు సాగిపొండి… ఎంత ఎత్తుకు ఎదిగిపోతారో మీరే కొన్నేళ్ల తర్వాత చూడొచ్చు. పోటీ పడి ఎదిగే దానిలో పరిపక్వత ఉండదు.. హడావుడి తప్పించి. అదే పోటీలేకుండా
మన స్వంత స్టైల్‌లో ఎదిగే దానిలో చాలా పరిపక్వత, సంతృప్తీ ఉంటాయి. వాటిని అనుభవించండి.

– నల్లమోతు శ్రీధర్

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.