సర్వేలో విశ్వసనీయత???

0
721

electionsతెలంగాణాలో కె.సి.అర్ కే ఎక్కువ ప్రజాదరణ ఉంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా టి.ఆర్.యస్ గెలుస్తుంది అనటంలోనూ సందేహం లేదు. కానీ 87% మంది కె.సి.ఆర్ కి మద్దతు పలుకుతున్నారు అనటంలోనే సందేహం. నిజానికి 87 % మంది మద్దతు ఒక వ్యక్తికి ఏకపక్షంగా ఉండటం అనేది దాదాపు అసాధ్యం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 55 % కన్నా ఎక్కువమంది ఒక వ్యక్తికి పూర్తి మద్దతు పలకటం కూడా కష్టం. సాధారణంగా ఎలాంటి సర్వేలో అయినా 50-60 శాతం మంది ప్రభుత్వ పని తీరును పర్వాలేదు అని చెప్తారు. 20-25 శాతం మంది అధ్బుతం అని, మిగతా 20-25 శాతం మంది అధ్వాన్నం అని చెప్తారు. సమస్యంతా ఈ పర్వాలేదు ను ఎటువైపు తీసుకుంటున్నారు అనేదాని మీద ఆధార పడి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే సర్వే సంస్థలు ప్రజల్లో కి తప్పుడు సంకేతాలు పంపిస్తాయి. ఆ సర్వేలో తమ విశ్వసనీయత దెబ్బతినకుండానే ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తాయి. నిజానికి విడిపి అసోసియేట్శ్ కూడా ఇక్కడ అదే పని చేసింది, కె.సిఆర్ కి 87 శాతం మంది మద్దతు ఉంది అని చెప్తూనే 51 శాతం మంది టి.అర్.యస్ కి ఓటు వేస్తారు అని చెప్పటంలోనే అసలు వ్యూహం దాగుంది. అసలు టి.ఆర్.యస్ అంటే కె.సి.ఆర్ మాత్రమే. మరి కె.సి.,ఆర్ కి ఉన్న ఆదరణ టి.ఆర్.యస్ కి ఎందుకు లేదు. కొత్తగా మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన పార్టీకి, అధినేత మీద తప్ప మిగతా ఎమ్మేల్యేల మీద కానీ, మిగతా మంత్రుల మీద ఎలాంటి వ్యతిరేకత కానీ, అనుకూలత కానీ ఉండదు. అందులోనూ పూర్తిగా కె.సి.ఆర్ కనుసన్నల్లో నడిచే టి.ఆర్.యస్ పార్టీలో ఆ పరిస్థితి ఊహించలేము. మరి ఓట్ల పొందటంలో వాళ్ళిచ్చిన సర్వేలోనే ఉంత భారీ తేడా ఎందుకుంది ??

ఇది టి.ఆర్.యస్ కో, కె.సి.ఆర్ కో పరిమితం కాదు, చంద్రబాబు విషయంలో కూడా ఆయనకు 58 శాతం మంది మద్దతు ఉండి , ఓట్ల విషయంలో 45 శాతం మందే ఓట్లేస్తారనటం , మోదీ కి 67 శాతం మంది మద్దతు పలికి 53 శాతం మందే ఓటేస్తారనటం కూడా ఇలాంటిదే
.
ఇప్పటికిప్పుడు తెలంగాణాలో ఎన్నికలు జరిగితే టి.ఆర్.యస్ , ఆంధ్రాలో టి.డి.పి , ఇండియా మొత్తం మీద మోదీ నే గెలుస్తారు అనటంలో సందేహం లేదు. కాకపోతే ఈ సర్వేలు వ్యతిరేకంగా ఆలోచిస్తున్న ప్రజల అలోచనపై ప్రభావాన్ని చూపిస్తాయి, మనమేదైనా తప్పుగా ఆలోచిస్తున్నామేమో, అందరూ పొగుడుతున్నారు, కాబట్టి మనం కూడా పొగుడుదాము అనే గొర్రె దాటు మనస్తత్వాన్ని మరింతగా ప్రేరేపిస్తాయి

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.