పురుషుడు – షట్కర్మలు

1
689

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు…పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది..

కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు

(కామందక నీతిశాస్త్రం)

కార్యేషు యోగీ, కరణేషు దక్షః 
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః


కార్యేషు యోగీ పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
కరణేషు దక్షః – కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
రూపేచ కృష్ణః – రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే) ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.
క్షమయా తు రామః – ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
భోజ్యేషు తృప్తః భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
సుఖదుఃఖ మిత్రం – సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు – ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.


Sreedevi Kosinepalli 

1 COMMENT

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.