దీపావళి పండుగ గురించి…

0
1651

ఆసేతు హిమాచలం పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆస్వయుజ మాసంలో వస్తుంది(అక్టోబరు). మెదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి.

నరక చతుర్దశి నాడు సూర్యోదయమునకు ముందుగా లేచి అభ్యంగన స్నానం చేయాలి. నరకుని ఉద్దేశించి నాలుగువత్తులతో దీపమును దానము చేయాలి. సాయంకాలం గుళ్ళలో దీపాలని వెలిగించాలి. ఆనాటి వంటలో మినప ఆకులతో కూర వండుకుంటారు.

అమావాస్యనాడు సూర్యుడు ఉదయిస్తున్న ప్రత్యూష కాలంలో తలస్నానం చేయాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి. మధ్యాహ్నం వేళల్లో అన్నదానాలు చేస్తేసారు. సాయంత్రము లక్ష్మీ పూజ చేయాలి. దేవాలయాలలో, ఇంటి ముంగిళ్ళలో దీపాలను అలంకరించుకోవాలి. కొన్ని ప్రాంతాలలో చెక్కతో చెట్లలాగా చేసి అందులో దీపాలను ఉంచుతారు. వీటినే దీప వృక్షాలంటారు. కొన్ని గుళ్ళల్లో ఇత్తడి దీప వృక్షాలు కూడా దర్శనమిస్తాయి. ఆకులతో దొన్నెలు కుట్టి వాటిలో నూనెతో దీపాలను చేసి నదులలో, కొలనులలో, నూతులలో (బావి) తెప్పలవలే వదులుతారు.

ఆనాటి రాత్రికి స్త్రీలు చేటలు, తప్పెటలు వాయిస్తూ సంబరంగా జేష్ఠాదేవిని(అలక్ష్మి, పెద్దమ్మారు, దారిద్ర్యానికి సూచన) ఇండ్లనుండి తరుముతారు. తరువాత ఇంటిని ముగ్గులతో అలంకరించి, బలి చక్రవర్తిని స్థాపించి పూజింస్తారు. ఇది మూడవ రోజు. బలిపాడ్యమి. ఉదయము జూదములాడుతారు. ఆరోజు గెలిచిన వారికి సంవత్సరమంతా జయం కలుగుతుందని నమ్మకం. ఈనాడు గోవర్ధన పూజ కూడా చేస్తారు.

దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటానడానికి అనేక కథలు చెప్తారు. అందులో ప్రధానమైనవి:

నరకాసుర వధ
బలిచక్రవర్తిరాజ్య దానము
శ్రీరాముడు రావణసంహారానంతరము అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశ మవటం (భరత్ మిలాప్) పురస్కరించుకుని
విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకము జరిగిన రోజు

ఈ కథలలో బలిచక్రవర్తికథ తప్ప మరి ఏది వ్రతగ్రంథములలోను, ధర్మశాస్త్రగ్రంధములలోను కనిపించదు. ధర్మసింధువంటి అన్ని గ్రంధములలోను బలిచక్రవర్తికథ మాత్రమే వివరింపబడింది. నేడు దీపావళి అనగానే మనకు గుర్తువచ్చే బాణాసంచ కాల్పులుకు ఆధారమైన నరకాసురవధ ఎంతో ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ కథ ప్రస్తావన వ్రతగ్రంధములలో కనపడదు. నరకభయనివారణార్థము అభ్యంగనస్నాము, దీపములతో అలంకరించటం, లక్ష్మీపూజ తదితర విషయములు తెల్పబడ్డాయి. ఈ వ్రత గ్రంధాలలోని “నరక” శబ్దానికి నరకము అనుటానికి మారుగా “నరకాసురుడు” అని అన్వయించి తర్వాతివారు పురాణకథతో జోడించి ఉంటారని కొందరు పండితుల అభిప్రాయం.ఇందులో జ్యోతిశ్శాస్త్ర సంబంధమగు రహస్యం ఇమిడి ఉన్నదని కొందరి అభిప్రాయం…

భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది.
పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు.
అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది.
కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది.
ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు.
పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు.
ఐతే వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ, పురుష భేదం,ప్రాంతం,కుల మత భేధాలు లేకుండా అందరూ ఇష్టపడే ఏకైక పండుగ మాత్రం దీపావళి ఒక్కటే.

భారత దేశమంతటా ప్రచారమున్న గాధ నరకాసుర వధ. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు తరువాత శ్రీకృష్ణుడు నరకాసురుని వధించెను.
నరకుడి పీడ వదలటంతో ఆనందపరవశులైన ప్రజలు అదే రాత్రి మిగిలిన భాగమును, మరుదినమునను మహోత్సవాలు జరుపుకొన్నారు. ఆనాటి ఉత్సవాలకు చిహ్నంగా ప్రజలు ప్రతి యేటా ఈ రెండు రోజులూ గొప్పగా పండుగలు చేసుకొంటున్నారు

శ్రీరామచంద్రుడు రావణ వధానంతరం లంక నుండి అయోధ్యా నగరానికి మరల తిరిగిరావడం, పట్టాభిషేకం జరగడం ఈనాడే అంటారు. శ్రీరాముడు భరతునితో మరల కలియుటకు ఉపలక్షణంగా “భరత్ మిలాప్” అను పండుగ ఉత్తర భారతమంతా నేటికీ చేస్తున్నారు. ఈ విశ్వాసం వల్లనే రాజులు విజయదశమి నాడు సీమోల్లంఘన చేసి శత్రువులపై దాడి చేసి, విజయంతో దీపావళి నాడు మరలి వచ్చుట సంప్రదామయ్యింది. ఒక్కో పురాణంలో, ఒక్కో ధర్మ శాస్త్రంలో ఒక్కో గాధ లిఖించబడినప్పటికీ నరకాసుర వధ మాత్రమే దీపావళి పండుగకు అంకురార్పణ అన్న గాధనే అందరూ అనుసరిస్తుండడంతో అదే స్థిరపడిపోయింది.

శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై లోకకంటకుడైన నరకాసురుని వధించినందుకు సంబరంగా జరుపుకొనే ఈ దీపావళి పండుగను
దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన దివ్యజ్యోతి ఈ జీవకోటికి వెలుగును ప్రసాదించిన విశిష్టమైన రోజుగా
మరియు శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతాదేవితో అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శుభసందర్భంగా కూడా చెప్పుకుంటారు.

దీపావళికి దేదీప్యమైన దివ్యకాంతుల దీపాలను అలంకరించి, బాణాసంచా కాలుస్తూ, అందరూ వారి వారి ఆనందాలను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇక ప్రకృతి పరంగా ఆలోచిస్తే, ఈ కాలమందు సర్వజీవులను వ్యాధిగ్రస్తులను చేసే కీటకాలు, పంటలను నాశనము చేసే క్రిమికీటకాలు అధికంగా ఉధ్బవిస్తాయి. కనుక ఈ బాణాసంచా కాల్పుల వల్ల కీటకసంహారం కలిగి ప్రజలకు అన్నివిధాల మేలు జరుగుటకే ఈఆచారం పెట్టి ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు..కానీ ఇదో పిచ్చిలా తయారయ్యి…దానివల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది…అవసరానికి ఉపయోగ పడవలసిన డబ్బు అనవసరంగా ఒక్కరోజు కాసేపు మానసిక ఆనందం కోసం ఖర్చు పెడతాము..

దీపావళి ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో, ఆ ఇంట శ్రీమహాలక్ష్మి ప్రవేశిస్తుందని మనకు ఋగ్వేదం చెప్తోంది. అటువంటి పుణ్య దిన సాయం సంధ్యా కాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు తొలుత దీపాలు వెలిగించి, శ్రీమహాలక్ష్మి అష్టోత్తరశతనామాలతో క్రింద వర్ణించిన విధంగాపూజ గావించి, ఈ సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టు సర్వ సంపన్న శక్తివంతురాలుగా భావించి, నివేదన చేసి, పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయుటవల్ల కాలి అందియలు ఘల్లు ఘల్లుమ‌ని అన్నట్ల ఆమహాలక్ష్మి ప్రసన్నమౌతుందట…

Hello Friends !!!

“దీపావళి అంటే ఆనందాలు పంచాల్సిన, వెలుగులు పెంచాల్సిన పండుగు” .

ఈ సంవత్సరం నుండి దీపావళిని కొత్తగా జరుపుకుందాం !!

1. దీపావళి రోజు దీపాలతో అలంకరించవలసింది మన గృహలని కాదండి. మన మనసులని.
2. అజ్ఞానం అనే అందకారాన్ని వెలుగులతో కాల్చేద్దాం
3. చీకటితో నిండిన మన జీవిత మార్గాలలో వెలుగు నింపేసుకుందాం
4. ఈర్ష , ద్వేషం, మోహం, వంటి కారు చీకట్లని పేల్చేద్దాం
5. స్నేహం, ప్రేమ, జాలి, దయ, కరుణ వంటి వెలుగులను పంచి కొత్త బంగారు లోకాన్ని సృష్టిద్దాం

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.