ఇదే అట్లతద్ది పండుగ…!

0
652

అట్లతద్ది …అట్లతదియ…ఉయ్యాల పండుగ…గోరింటాకు పండగ అని పేర్లు..

తెలుగువారి మరుగున పడిపోయిన పండగల్లో ఒకటి..

దీనిని ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు..
అట్లతదియకు ముందు రోజు చేతులకి,కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటారు.
గుమ్మాలకు తోరణం కడతారు..
ఈ రోజు తెల్లవారు ఝామునే మేల్కొని ఇంటిలో తూరుపు దిక్కున మండపం ఏర్పాటు చేసి గౌరీదేవి పూజ చేసి
పాలు పోసి వండిన పోట్లకాయ కూర, ముద్ద పప్పు,గూoగూర పచ్చడి,పెరుగుతో అన్నం తింటారు..
సాయంత్రం వరకు ఉపవాసం ఉండి..
సాయంత్రం చెరువులో దీపాలు వెలిగించి ఇంటికి చేరి
సాయం సమయాన గౌరీపూజ చేసి..
ముత్తయిదువులని పూజకు పిలిచి..
చామంతి,తులసి దళం,తమల పాకులు ఇలా 11 రకాల పూలు,ఆకులతో 11 ముడులు వేసిన తోరాన్ని గౌరీదేవి ముందు ఉంచి పూజ చేస్తారు
ముత్తైదువులను కూర్ఛోబెట్టి..
పసుపు,కుంకుమ,పూలు,పారాణి పెట్టి వారిని అలoకరించి
11 అట్లను,11 రకాల పళ్లను
గౌరీదేవికి నైవేధ్యం పెట్టి అట్లతదియ నోము కథ చదువుకుని ఆక్షింతలు వేసుకుని
ముత్తైదువులకు నల్లపూసలు,ఒక వాయనం ,తాంబూలం ఇస్తూ…వాయనం ఇచ్చిన ప్రతి సారీ..

ఇస్తినమ్మ వాయనం…
పుచ్చుకుంటినమ్మ వాయనం
అందించానమ్మ వాయనం
అందుకున్నానమ్మ వాయనం
ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం
ముమ్మాటికీ పుచ్చుకుంటినమ్మ వాయనం

అంటూ ప్రతి ఒక్కరికీ ఇచ్చి
అందరూ భోజనాలు చేస్తారు..
తర్వాత ఊయల కట్టి ఊగుతూ పాటలు పాడుతారు..

అట్లతద్దోయ్….ఆరట్లోయ్
ముద్దపప్పోయ్…మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు…సింగఁరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు …మందార పళ్లు ………..అంటూ పాటలు పాడుకుంటూ ఆడుకుంటారు…
ఇదే అట్లతద్ది పండుగ…

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.