జీవిత యుద్ధాలు..దేవుడు..!

0
480

నేను ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముతాను.
కస్టం ఏ రూపంలో అయినా ఉండొచ్చు.మనిషి కస్టాన్ని సాటి ఏ మనిషి తీర్చలేనప్పుడు.. మనిషి తన కస్టాన్ని తీర్చగల ఏకయిక సాధనం గా భావించే ..మనిషి యొక్క ఆఖరి నమ్మకమే దేవుడు ..
దేవుణ్ణి నమ్మటం వేరు..దేవుడు ఉన్నాడనటం వేరు.దేవుడు లేడనటం వేరు.

ఈ మూడు విరుద్ధ అంశాల్లోనో ఉన్న ఏకీక్రుత అంశం ఏంటంటే…ఎవరి వాదాన్ని వాళ్ళు నమ్మటం.
ప్రాధమికంగా చెప్పాల్సిందేమంటే దేవుడనేవాడు మనిషి యొక్క ఒక నమ్మకం మాత్రమే.
ఈ నమ్మకం మీదే మతం ఆధారపడి ఉన్నది

దేవుడున్నాడో లేదో నాకు అనవసరం. దేవుడు ధర్మ పరుడా.. అధర్మపరుడా.. దేవుడు నాకు మంచి చెప్పాడా.. చెడు చెప్పాడా అనే వివేచన కూడ నాకు అనవసరం. బతుకు పోరాటం లో ఓడిపోవటమే తప్ప గెలవటం ఓ జీవిత కాలంలో ఎప్పుడూ చూడని మనుషులకి తెలుస్తుంది దేవుడంటే ఎలా ఉంటాడో..
ఆర్ధికంగా..సామాజికంగా.. దైహికంగా సకల కస్టాలు అనుభవించే మనుషులకు వాళ్ళ ఆఖరి ఆశ దేవుడు.
దేవుడిని నమ్మటం మనుషుల బలహీనతకాదు బలం.

మనిషి తనకు తాను ఇచ్చుకునే స్వయం బలం..స్వయశక్తి.

వేల సంవచ్చరాలక్రితం ఎవరు స్రుస్టించారో తెలీదు
కాని..మతాలేవయినా ..మనుషులందరూ ఈ దేవుడున్నాడు అనే ప్రాధమిక సూత్రం మీదే బ్రతుకుతున్నారు.
దేవుడనేవాడు మనిషికి ఆఖరి అవసరం గా మారటానికి కారణం.
మనుషులే..

మనుషులులు ద్రోహం చేస్తారు.మోసం చేస్తారు.మనుషులు హత్యలు చేస్తారు .పక్కనే ఉన్న మనుషులంతా మనుషుల రూపం లో ఉన్న రాక్షసులుగా మారి ..తమసాటి మనుషుల యొక్క ధన మాన ప్రాణాలని దోచేస్తుంటే మనుషులంతా తమ కస్టాలని తీర్చేవాడు తమకు సహాయం చేసేవాడు..ఒకడున్నాడు..అతడే పై వాడు అని తప్పనిసరిగా.ఆ నమ్మకంతో జీవితంలో చచ్చేవరకూ వందలసార్లు ఓడిపోతున్నా యేదో ఒకరోజు దేవుడు కరుణిస్తాడు అన్న నమ్మకంతో జీవిత యుద్ధాలని చేశారు.

జీవితయుద్దాల్లో అడుగడుగునా ఓడిపోతూ కూడా గెలుపు కోసం ఆఖరి ఆశతో పోరాడారు.
మనిషిని మనిషి ప్రేమించలేకపోవటం..మనిషిని మనిషి ద్వేషించటం లోనే దేవుడి ఉనికి ఉన్నదంతా.
చుట్టూ చూడండి.చరిత్రని చూడండి. ప్రపంచాన్ని చూడండి.

ప్రపంచంలో జరిగిన యుద్ధాలన్నీ మనుషుల మీద మనుషులు ద్వేషంతో చేసినవే.
మనుషులని మనుషులు ప్రేమించాలని మతం చెబుతున్నా ..మనుషులని మనుషులు ద్వేషిస్తూ చర్రిత్రలని అస్థి పంజరాలతో.. దానవత్వంతో నింపేశారు.

దెవుడి అస్థిత్వాని కి మనుషుల్లో ఉన్న అభద్రతాభావంతో పాటు మనుషుల్లో ఉన్న పేదరికం అతిపెద్ద కారణం. దేవుడనే వాడు మనిషి మనుగడకి..అవసరమయిన అంశంగా మిగలటానిక్కారణం అసలు మనుషులే.

మన పూర్వీకులంతా వాళ్ళ అవసరం కోసం పుట్టించారో…పక్కవాళ్ళని మోసం చేయటానికి పుట్టించారో.. కాని వేల సంవచ్చరాలక్రితం మనుషులేలా ఉండే వారో ఒక్క సారి ఊహించుకుంటేనే భయమేస్తుంది.ఎంతటి పశుప్రాయపు కస్టాలనుభవించేవారో ఊహకే అందదు.మనుషూల చేతిలో మనుషులే ఎంతటి వర్గ వివక్షత ..నేదుర్కోని ఉండేవాళ్ళో .

మన పూర్వీకులంతా వేల సంవచ్చరాలు..పక్కనున్న మనుషులని.. మాట్లాడేవాళ్ళని..సహాయం చేయ గల్లవాల్లని..ప్రేమించగల్ల వాల్లని ప్రేమించలేక ..పక్కవాళ్ళ ప్రేమని పొందలేక ..ప్రేమకోసం తపిస్తూ..తమని ప్రేమించే దేవుడి మీద భక్తి చాటున ప్రేమతో బతికి పోయారు.
జీవిత యుద్ధాలని చేశారు.


@ కొనకంచి లక్ష్మి నరసింహా రావు

LEAVE A REPLY

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.